logo
Updated : 04/12/2021 03:56 IST

గ్యాస్‌ సిలిండర్‌ లీకై.. హోటల్‌ దగ్ధం

కాలిపోతున్న హోటల్‌

జైనథ్‌, న్యూస్‌టుడే : జైనథ్‌ మండలం భోరజ్‌ ప్రయాణ ప్రాంగణం సమీపంలోని హోటల్‌లో గ్యాస్‌ సిలిండర్‌ లీకై హోటల్‌ దగ్ధమైన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడు సంజీవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రోజులాగానే ఉదయం 5 గంటలకు హోటల్‌కు చేరుకున్న సంజీవ్‌ వంట పనులను ప్రారంభించాడు. 11 గంటల ప్రాంతంలో సిలిండర్‌ గ్యాస్‌ సిలిండర్‌ రెగ్యులేటర్‌ వద్ద లీకేజీ కావడంతో తేరుకునేలోపు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేయడంతో అగ్నిమాపక శకటం వచ్చే సరికి సామగ్రి మొత్తం కాలిబూడిదైంది. ఎల్‌ఐసీ కట్టేందుకు కౌంటర్‌లో దాచిపెట్టిన రూ.50 వేల నగదుతో పాటు 2 రిఫ్రిజిరేటర్లు, 2 చరవాణులు, హోటల్‌ ఫర్నిచర్‌, కిరాణ సామాను అంతా కాలిపోయిందని, సుమారు 2.60 లక్షలు నష్టపోయినట్లు బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ మహేంద్రనాథ్‌ ఆర్‌ఐ విజయ్‌లు అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించారు.

Read latest Adilabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని