logo

ఇంటింటా ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి గ్రామాల్లో, పట్టణాల్లోని వార్డుల్లో ఇంటింటా ఆరోగ్య సర్వేను పక్కాగా చేపట్టాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు.

Published : 21 Jan 2022 02:38 IST


మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ

నిర్మల్‌, న్యూస్‌టుడే : జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి గ్రామాల్లో, పట్టణాల్లోని వార్డుల్లో ఇంటింటా ఆరోగ్య సర్వేను పక్కాగా చేపట్టాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక పాలనాప్రాంగణంలో వైద్య, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో, పట్టణాల్లోని వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి జ్వరంతో బాధపడుతూ వైరస్‌ లక్షణాలున్న వారిని గుర్తించి అక్కడే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్‌ కిట్లను అందజేయాలన్నారు. ఈ బృందంలో ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్త, మహిళా సంఘాల సభ్యులు, ఆర్‌పీలు ఉండాలన్నారు. అన్ని పీహెచ్‌సీలలో కొవిడ్‌ టెస్టింగ్‌, హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపాల్టీలో కమిషనర్ల సమన్వయంతో సర్వేను సమర్థవతంగా చేపట్టాలని, కొవిడ్‌ రెండో డోస్‌, బూస్టర్‌ డోస్‌ తీసుకోని వారిని గుర్తించి అక్కడే ఇప్పించాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగుల చికిత్సకు ఆక్సిజన్‌తో ఉన్న పడకలు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతి నిత్యం 25 ఇళ్లలో సర్వే నిర్వహించి రిపోర్ట్‌ పంపాలని, మండలాల వారీగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు పాలనాధికారులు హేమంత్‌ బోర్కడే, రాంబాబు, జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌, ప్రత్యేక అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పాల్గొన్న అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని