logo

ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులోకి..

ఒక్కసారి 99496 68363కి కాల్‌ చేసి చూడండి. ఐసీడీఎస్‌ సిబ్బంది మీ సేవకై సిద్ధంగా సీడీపీవో సాదియా రుక్సానా అన్నారు. గురువారం మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. సీడీపీవో, పోషణ్‌ అభియాన్‌

Published : 21 Jan 2022 02:38 IST


బాలుడి ఆరోగ్య పరీక్షలను పరిశీలిస్తున్న సీడీపీవో సాదియా రుక్సానా, సిబ్బంది

తిర్యాణి, న్యూస్‌టుడే: ఒక్కసారి 99496 68363కి కాల్‌ చేసి చూడండి. ఐసీడీఎస్‌ సిబ్బంది మీ సేవకై సిద్ధంగా సీడీపీవో సాదియా రుక్సానా అన్నారు. గురువారం మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. సీడీపీవో, పోషణ్‌ అభియాన్‌ ప్రాజెక్టు అధికారి కూమార స్వామి, పర్యవేక్షురాళ్లు తిరుపతమ్మ, సోంబాయి నాలుగు గ్రూపులుగా విడిపోయి పిల్లల ఆరోగ్యం గురించి, రక్తహీనత ఉన్నవారిని గుర్తించారు. సీడీపీవో సాదియా రుక్సానా మాట్లాడుతూ.. అంగన్‌వాడీ సేవలు, పిల్లల్లో ఆహార నియమాలు, పిల్లల్లో ఎదుగుదల లోపాలను గమనించడం నివారణ చర్యలు లబ్ధిదారులు ఫోన్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. నవజాతశిశువు నుంచి అయిదేళ్ల లోపు పిల్లల ఎదుగుదలకు సంబంధించి ఎలాంటి సందేహాన్ని అయినా ఫోన్‌లో అడిగి నివృతి చేసుకోవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని