logo

కుమారుడిని తిట్టాడని కాల్పులు..వ్యక్తికి జీవితఖైదు

ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం మాజీ అధ్యక్షుడు ఫారుఖ్ అహ్మద్‌కు జీవిత ఖైదు,

Updated : 24 Jan 2022 13:59 IST

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం మాజీ అధ్యక్షుడు ఫారుఖ్ అహ్మద్‌కు జీవిత ఖైదు, ₹12వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. 2019 డిసెంబర్ 18న తాటిగూడలో సయ్యద్‌ జమీర్‌ అనే వ్యక్తిపై తుపాకీతో ఫారుఖ్‌ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడిన జమీర్‌ డిసెంబర్ 26న మృతి చెందాడు. పిల్లల క్రికెట్ ఆటలో తలెత్తిన వివాదం.. తీవ్ర ఘర్షణలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కుమారుడిని తిట్టాడనే కోపంతో ఫారుఖ్‌ కాల్పులకు పాల్పడ్డాడు. గతేడాది మార్చి 24న జిల్లా జైల్లో ఫారుఖ్‌ ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. ఈకేసులో ఏ-2, ఏ-3లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని