logo

ఈ-మెయిల్‌ పట్టి.. రూ.లక్ష కొల్లగొట్టి

ఈ- మెయిల్‌ ఐడీని హ్యాక్‌ చేసి ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులో ఉన్న రూ.లక్షతో సైబర్‌ నేరగాళ్లు వివిధరకాల వస్తువులు కొనుగోలు చేసిన ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. జన్నారం మండల

Updated : 29 Jan 2022 05:42 IST

క్రెడిట్‌కార్డుతో అంతర్జాలంలో వస్తువుల కొనుగోలు

జన్నారం, న్యూస్‌టుడే: ఈ- మెయిల్‌ ఐడీని హ్యాక్‌ చేసి ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులో ఉన్న రూ.లక్షతో సైబర్‌ నేరగాళ్లు వివిధరకాల వస్తువులు కొనుగోలు చేసిన ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. జన్నారం మండల కేంద్రంలో శుద్ధజల కేంద్రాన్ని నిర్వహిస్తున్న మామిడి రవి క్రెడిట్‌కార్డు నుంచి ఈ నెల 26న రాత్రి 1.30 గంటల ప్రాంతంలో అంతర్జాలం వేదికగా వ్యాపారం జరిగింది. రూ.33 వేల విలువైన ఏసీ, రూ.18 వేల వాషింగ్‌ మెషిన్‌, రూ.20 వేల టీవీ, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. ఫోన్‌ నంబర్‌తో పాటు అనుసంధానం చేసిన ఈ-మెయిల్‌కి ఓటీపీ రావడంతో సైబర్‌ నేరగాళ్ల పని సులువైంది. బాధితుడు ఉదయం క్రెడిట్‌కార్డు వివరాలు చూసుకొని రూ.ఒక లక్ష షాపింగ్‌ జరిగినట్లు నిర్ధారించుకొని లబోదిబోమన్నాడు. వెంటనే క్రెడిట్‌కార్డు వినియోగదారుల కేంద్రానికి ఫోన్‌ చేశాడు. స్పందించిన వారు అర్ధరాత్రి దాటిన తర్వాత వేలాది రూపాయల షాపింగ్‌ జరుగుతుండటంతో అనుమానం వచ్చి మీక్రెడిట్‌ కార్డు సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. వారి సూచన మేరకు సైబర్‌ క్రైం టోల్‌ ఫ్రీ నెం.155260కు ఫోన్‌ చేయడంతో అంతర్జాలంలో దరఖాస్తు ఫారం ఇచ్చారు. దానిని పూర్తి చేసి పంపగా.. అధికారులు కేసు నమోదు చేశారు. క్రెడిట్‌కార్డు సేవలు నిలిపివేయడంతో డబ్బులు తిరిగి వస్తాయని అధికారులు చెప్పినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పి.సతీష్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు