logo

ఇద్దరిని చిదిమేసిన రోడ్డు ప్రమాదం

ఎడ్ల కొనుగోలు కోసం వెళ్లి.. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన నేరడిగొండ మండలంలో చోటు చేసుకుంది. రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.  పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 20 May 2022 04:11 IST

ఎడ్ల కొనుగోలు కోసం వెళ్లి అనంతలోకాలకు..

జాదవ్‌ కిషన్‌               రాఠోడ్‌ సుభాష్‌

నేరడిగొండ, సిరికొండ, న్యూస్‌టుడే: ఎడ్ల కొనుగోలు కోసం వెళ్లి.. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన నేరడిగొండ మండలంలో చోటు చేసుకుంది. రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.  
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలం సుంకిడి గ్రామానికి చెందిన రాఠోడ్‌ సుభాష్‌(38) వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లను కొనేందుకు అదే గ్రామానికి చెందిన తన బంధువు జాదవ్‌ కిషన్‌(55)తో కలిసి ద్విచక్ర వాహనంపై బోథ్‌ మండలంలోని కుచిర్యాలలోని తమ బంధువు లాలూసింగ్‌ ఇంటికి బుధవారం సాయంత్రం బయలుదేరారు. రూ.32 వేలకు ఎడ్లను కొనుగోలు చేసి, అక్కడే భోజనం చేశారు. అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరుతామని అనగా, చీకటి పడింది తెల్లవారు జామున వెళ్లండి అని చెప్పినా రాత్రి 9 గంటల సమయంలో అక్కడి నుంచి బయలుదేరారు. కుప్టి వంతెనపైకి రాగానే రాత్రి 11 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. కిషన్‌ రోడ్డు మధ్యలో పడిపోవడంతో పలు వాహనాలు అతడి శరీరంపై నుంచి వెళ్లడంతో పూర్తిగా చితికిపోయింది. మరో కిలోమీటరు దూరంలో ద్విచక్రవాహనం లభ్యమైంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే రాఠోడ్‌ సుభాష్‌ అయిదేళ్ల కిందట మద్యం వ్యసనాన్ని పూర్తిగా వదిలేశాడు. వ్యవసాయ పనులతో పాటు హోటల్‌ నిర్వహణ చేపడుతూ కుటుంబానికి అండదండగా ఉంటున్న క్రమంలో విధి అతడిని చిన్నచూపు చూసింది. ఈ ఘటన జరుగడంతో ఇంటిల్లిపాది శోకసంద్రంలో మునిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు నేరడిగొండ ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.


మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య, కుటుంబ సభ్యులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని