logo

యూడైస్‌ వివరాలను యాప్‌లో నమోదు చేయండి

యూడైస్‌ కార్యక్రమం కింద విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, మౌలిక సదుపాయాల వివరాలను ఈ నెల 28లోగా యాప్‌లో నమోదు చేయాలని జిల్లా పాలనాధికారి సిక్తా

Published : 22 May 2022 03:37 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, చిత్రంలో అదనపు పాలనాధికారి

కైలాస్‌నగర్‌, న్యూస్‌టుడే: యూడైస్‌ కార్యక్రమం కింద విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, మౌలిక సదుపాయాల వివరాలను ఈ నెల 28లోగా యాప్‌లో నమోదు చేయాలని జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. ఈమేరకు శనివారం కలెక్టరేట్‌లో విద్య, సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమం తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. యాప్‌లో నమోదు చేస్తున్న వివరాలను మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న వివరాలను తేడా రాకుండా చూసుకోవాలని సూచించారు. అదనపు పాలనాధికారి రిజ్వాన్‌ బాషా షేక్‌ మాట్లాడుతూ.. 1438 పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీ, తాగునీరు, వంటగది తదితర వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, ఇందుకు అవసరమైన శిక్షణ నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఈఓ ప్రణీత, సెక్టోరల్‌ అధికారి నారాయణ, డీఎంహెచ్‌ఓ డా.నరేందర్‌ రాఠోడ్‌, ఎస్సీ సంక్షేమ అధికారి సునీతకుమారి, మైనారిటీ సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాల్లో వసతులపై నివేదికలు సమర్పించాలి

కైలాస్‌నగర్‌: పదో తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించి వసతుల ఏర్పాట్లపై నివేదికలను సమర్పించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. 64 కేంద్రాల్లో 11,256 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. విద్యార్థులకు సీట్ల కేటాయింపు, విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, వైద్యసేవలపై ఎంఈఓలు, తహసీల్దార్లు నివేదికలివ్వాలని స్పష్టం చేశారు. ఇన్విజిలేషన్‌ విధుల్లో ఉన్న వారికి చరవాణులు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించవద్దని సూచించారు. మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి 11 సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అదనపు పాలనాధికారి రిజ్వాన్‌ బాషా షేక్‌, అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ రాజేశ్వర్‌, డీఈఓ ప్రణీత, ఏడీఆర్డీఓ రవీందర్‌ రాఠోడ్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని