logo

ఆఫీసర్స్‌ క్లబ్‌లో గానా బజానా

మూడు రోజుల కిందట పట్టణంలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో జరిగిన ఒక నేత జన్మదిన వేడుకల్లో ఏర్పాటు చేసిన గానా బజానా వివాదాస్పదంగా మారింది. ఆలస్యంగా వెలుగు

Published : 22 May 2022 03:37 IST

వివాదాస్పదంగా మారిన కౌన్సిలర్‌ జన్మదిన వేడుకలు

యువతుల నృత్యాలు

ఆదిలాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: మూడు రోజుల కిందట పట్టణంలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో జరిగిన ఒక నేత జన్మదిన వేడుకల్లో ఏర్పాటు చేసిన గానా బజానా వివాదాస్పదంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. క్లబ్‌లో జరిగిన ఈ వేడుకల విషయమై ఆఫీసర్స్‌ క్లబ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సైతం ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అధికారులు, ప్రజా ప్రతినిధులు, వీఐపీలు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి అందుబాటులో ఉన్న ఈ క్లబ్‌లో ఆ రోజు రాత్రి జరిగిన విందు, వినోదాల్లో మహారాష్ట్ర నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి నృత్యాలు చేయించినట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇలాంటి వేడుకలు ఆదిలాబాద్‌ పట్టణంలో ఇదే మొదటిసారి కావడంతో అందరూ ఈ విషయం చర్చించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్లబ్‌లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఇందులో అనుమతి ఉంటుంది. కానీ సభ్యత్వం లేని ప్రజా ప్రతినిధి వేడుకలకు ఎలా అనుమతిచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్థానిక తెరాస కౌన్సిలర్‌ ఒకరు తన జన్మదినాన్ని ఇందులో గానాబజానా ఏర్పాటు చేసి రికార్డింగ్‌ డ్యాన్స్‌లు చేయించటం విమర్శలకు దారితీసింది. ఈ వేడుకల్లో పార్టీలకు అతీతంగా పలువురు నేతలు సైతం పాల్గొన్నారు. ఆఫీసర్స్‌ క్లబ్‌ను ఒకటో పట్టణ సీఐ సురేందర్‌ శనివారం సందర్శించి ఆరా తీశారు. ఈ విషయమై సీఐని ప్రశ్నించగా.. తమకెలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. వివరాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని