logo

పశువులను తరలిస్తున్న లారీల పట్టివేత

మండలంలోని పుసాయి గ్రామ సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకు వద్ద పశువులను తరలిస్తున్న మూడు లారీలను శనివారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ పెర్సిస్‌ బిట్ల తెలిపారు. మహారాష్ట్రలోని

Published : 22 May 2022 03:37 IST

లారీ నుంచి పశువులను దింపుతున్న యువకులు

జైనథ్‌, న్యూస్‌టుడే: మండలంలోని పుసాయి గ్రామ సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకు వద్ద పశువులను తరలిస్తున్న మూడు లారీలను శనివారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ పెర్సిస్‌ బిట్ల తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు గుర్‌దియాల్‌ సింగ్‌, మొహతాషీం ఆలమ్‌, మహ్మద్‌ జావెద్‌ఖాన్‌, మహ్మద్‌ సలీం మాస్‌జీద్‌, మహ్మద్‌ అస్లం ఖురేషిలు ఉదయం పూట లారీలలో 73 పశువులను తరలిస్తున్నారన్నారు. పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో భాగంగా అనుమానం వచ్చి లారీలను ఆపేక్రమంలో.. నిలపకుండా వేగంగా వెళ్లారన్నారు. దీంతో వెంబడించి పుసాయి గ్రామ సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకు వద్ద పట్టుకొన్నామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మూడు లారీల్లో 73 పశువులను కుక్కి తరలిస్తున్నారు. అందులో రెండు మృతి చెందాయన్నారు. అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకొన్నామన్నారు. పట్టుకున్న వాటిని రాంపూర్‌లోని గోశాలకు, లారీలని పోలీస్‌స్టేషన్‌కు తరలించామని ఎస్సై పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలో రెండు లారీలు..

ఆదిలాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నాగపూర్‌ నుంచి నిజామాబాద్‌కు రెండు లారీల్లో తరలిస్తున్న 59 పశువులను గ్రామీణ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం చాంద(టి) సమీపంలోని శ్రీనివాస గార్డెన్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. పశువులు తరలిస్తున్న రెండు లారీలను గుర్తించారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిబాబు తెలిపారు.


నిషేధిత గుట్కా స్వాధీనం

ఆదిలాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: పట్టణంలోని తాంసి బస్టాండ్‌ వద్ద నిషేధిత గుట్కా తరలిస్తున్న ఎజాజ్‌ అనే గుట్కా వ్యాపారిని రెండో పట్టణ ఎస్‌ఐ విష్ణు ప్రకాష్‌ శనివారం అదుపులోకి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా నిందితుడిని తనిఖీ చేయగా.. అతను రూ.4 వేల విలువైన గుట్కాను తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తరలించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని