logo

పల్లె ప్రగతి పనుల్లో రాష్ట్రస్థాయి గుర్తింపు

జిల్లాలో ఇదివరకు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు, చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిర్మల్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక

Published : 22 May 2022 03:37 IST

:మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఇదివరకు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు, చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిర్మల్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో 5వ విడత పల్లె, పట్టణ ప్రగతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఊరూరా మొక్కలు నాటి సంరక్షించడంతో పచ్చదనంతో కళకళలాడుతున్నాయని చెప్పారు. పల్లె ప్రగతి విజయవంతం చేయడంతో గ్రామ సర్పంచుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. జూన్‌ 3 నుంచి 18 వరకు 5వ విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతాయని, గతేడాది చేపట్టిన కార్యక్రమాలతోపాటు రానున్న సంవత్సరంలో చేపట్టనున్న పనులకు సంబంధించి కార్యాచరణ రూపొందించుకుఓవాలని సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే అనుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకుంటామని చెప్పారు. వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల ఏర్పాటుతో రహదారులపై చెత్తాచెదారం కనిపించడం లేదని, వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టాయన్నాని చెప్పారు. పట్టణ, గ్రామాల అభివృద్ధితో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని, తొలుత ఖాళీ స్థలాలను గుర్తించి పిల్లలు ఆడుకునేందుకు వీలుగా బాగు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి మండలానికి అయిదు క్రీడా మైదానాలు ప్రారంభించాలని చెప్పారు. మల్లీలేయర్‌ ప్లాంటేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాక్టర్లు, ట్రాలీలకు ప్రతి నెలా చెల్లించే రుసుములో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత మండలాల ఎంపీడీవోలకు తెలపాలని సూచించారు. పల్లె ప్రగతిలో పనులు విజయవంతంగా పూర్తిచేసిన 11 మంది సర్పంచులను సన్మానించారు. సదస్సులో జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌, జిల్లా అదనపు పాలనాధికారులు హేమంత్‌ బోర్కడే, రాంబాబు, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని