logo

లేదాయె కనికరం.. కారుమబ్బులతో కలవరం

హాజీపూర్‌ మండలంలో రైతన్నలకు ఎదురుచూపులు తప్పడంలేదు. కోతలు పూర్తి చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. తేమ పేరుతో కొద్దిరోజులు కొనుగోలు చేయకుండా

Published : 23 May 2022 03:19 IST

న్యూస్‌టుడే, హాజీపూర్‌ : హాజీపూర్‌ మండలంలో రైతన్నలకు ఎదురుచూపులు తప్పడంలేదు. కోతలు పూర్తి చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. తేమ పేరుతో కొద్దిరోజులు కొనుగోలు చేయకుండా అడ్డుకున్న కేంద్రాల నిర్వాహకులు ప్రస్తుతం లారీలు అందుబాటులో లేవని కొనుగోలు చేయడంలేదు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించేందుకు అధికారులు లారీలను పంపించడం లేదు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధాన్యం ఆరబోసి పడిగాపులు పడుతున్నామని మండలంలోని టీకనపల్లి, హాజీపూర్, ముల్కల్ల తదితర గ్రామాల రైతులు వాపోతున్నారు. పాలనాధికారి స్పందించి లారీలను వెంటనే ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. నిత్యం వర్షం కురుస్తుందనే భయంతో కేంద్రాల్లోనే జీవిస్తున్నామని రైతులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని