logo

పట్టా పేరుతో గ్రామ కంఠం భూమి ఆక్రమణ!

మండలంలోని ఎమాయికుంట గ్రామ పంచాయతీ కేంద్రంలోని గ్రామ కంఠం భూమిని 15 ఏళ్ల కిందట గ్రామానికి చెందిన పడవల్‌ కపూర్‌సింగ్‌ అనే వ్యక్తి.. పేర్‌వాల్‌ అమర్‌సింగ్, పవార్‌ ధరియాసింగ్, వక్కపల్లి వజ్రలతో

Published : 23 May 2022 03:44 IST

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: మండలంలోని ఎమాయికుంట గ్రామ పంచాయతీ కేంద్రంలోని గ్రామ కంఠం భూమిని 15 ఏళ్ల కిందట గ్రామానికి చెందిన పడవల్‌ కపూర్‌సింగ్‌ అనే వ్యక్తి.. పేర్‌వాల్‌ అమర్‌సింగ్, పవార్‌ ధరియాసింగ్, వక్కపల్లి వజ్రలతో పాటు పలువురికి ఇంటి స్థలాలను విక్రయించారు. దీంతో వారు ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ సమయంలో రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వేలు చేయకున్నా ఇళ్లు నిర్మించిన స్థలం తన పట్టా భూమిలో ఉందని పడ్‌వాల్‌ జగన్‌సింగ్‌ అనే వ్యక్తి ఆదివారం ఈ ఇళ్ల వద్ద సిమెంట్‌ స్తంభాలు పాతినట్లు సంబంధిత యజమానులు పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి గతంలో గ్రామ కంఠం స్థలాన్ని సర్వే చేసి ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు లేఖలు పంపినా ఇప్పటి వరకు ఎలాంటి సర్వే చేయలేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అధికారులు, గ్రామస్థులకు తెలియకుండా ఇంటి స్థలాలను ఆక్రమించడం అన్యాయమని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

తెలియకుండానే స్తంభాలు పాతారు - జాదవ్‌ లఖన్, సర్పంచి

గ్రామ పంచాయతీకి తెలియకుండానే భూమి యజమాని గ్రామ కంఠంలో సిమెంట్‌ స్తంభాలు వేశారు. పంచాయతీ తరఫున స్తంభాలు వేసినందుకు తీర్మానం చేసి తాఖీదులు ఇస్తాం.

సర్వేకు దరఖాస్తు చేశా  - విజయ్‌కుమార్, గ్రామ కార్యదర్శి

 ఎమాయికుంట గ్రామ పంచాయతీ కేంద్రంలోని గ్రామ కంఠం భూమి ఎంత ఉంది.. ప్రభుత్వ భూమి ఎంత ఆక్రమణలో ఉంది.. పట్టా భూమి ఎంత అనే దానిపై సర్వే చేసి ఇవ్వాలని తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తులు చేశాను. నెలలు గడిచిన సర్వే చేయలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని