logo

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు..

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూసిన పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు కావడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందస్తుగానే చేరుకున్నారు. పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, డీఈవో ప్రణీత పట్టణంలోని

Updated : 24 May 2022 06:45 IST

తొలిరోజున 11,132 మంది హాజరు

ఆదిలాబాద్‌లోని బాలక్‌ మందిర్‌ పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూసిన పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు కావడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందస్తుగానే చేరుకున్నారు. పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, డీఈవో ప్రణీత పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 64 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,288 మంది విద్యార్థులకు గాను 11,132 మంది పరీక్ష రాసినట్లు డీఈవో తెలిపారు. గైర్హాజరైన 156 మందిలో బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 28 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు తొలిరోజున ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మాస్కులు ధరించిన వారిని లోనికి అనుమతించారు. కొన్ని కేంద్రాల్లో థర్మల్‌ పరీక్షలు సైతం నిర్వహించారు. ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచారు. మారుమూల, మండల పరీక్షా కేంద్రాలకు బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు ఆటోల్లో తరలి వెళ్లాల్సి వచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. విద్యార్థులకు ఇన్విజిలేటర్లు సూచనలు ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బాగా రాయాలంటూ ఆశీర్వదించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని