logo

సోయా రాయితీ కోసం సీఎంపై ఒత్తిడి తీసుకురండి

జిల్లాలో అత్యధికంగా సాగయ్యే సోయా విత్తన రాయితీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జిల్లా ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురావాలని భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 29 May 2022 05:50 IST

మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : జిల్లాలో అత్యధికంగా సాగయ్యే సోయా విత్తన రాయితీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జిల్లా ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురావాలని భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతుబంధు సాకుతో ఇతర రాయితీలన్నీ ఎత్తివేస్తూ రైతులపై భారం మోపుతున్నారని విమర్శించారు. రుణమాఫీ చేస్తామని చెప్పి వడ్డీ పెరుగుతూ పోతోందని, పావలవడ్డీ కింద కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం తనవాటా చెల్లించని కారణంగా ఫసల్‌బీమా డబ్బులు రైతుల ఖాతాల్లో జమకావడంలేదని, కోర్టు ఆదేశించినా చలించడంలేదని పేర్కొన్నారు. కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు దయాకర్‌, పట్టణాధ్యక్షుడు లాలామున్నా, ప్రవీణ్‌, దినేష్‌ మాటోలియా, జోగురవి, రాందాస్‌, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని