logo

జులై నెలాఖరు వరకు ఈ-కేవైసీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈకేవైసీ దరఖాస్తులను జులై నెలాఖరు వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య అన్నారు. శనివారం ఇంద్రవెల్లిలో పర్యటించారు. రైతువేదిక వద్ద ఈ-కేవైసీ దరఖాస్తులు మండల వ్యవసాయ శాఖ అధికారులకు

Published : 29 May 2022 05:50 IST

ఇంద్రవెల్లి రైతువేదిక వద్ద రైతులు తీసుకొచ్చిన ఈకేవైసీ దరఖాస్తులను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య

ఇంద్రవెల్లి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈకేవైసీ దరఖాస్తులను జులై నెలాఖరు వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య అన్నారు. శనివారం ఇంద్రవెల్లిలో పర్యటించారు. రైతువేదిక వద్ద ఈ-కేవైసీ దరఖాస్తులు మండల వ్యవసాయ శాఖ అధికారులకు ఇచ్చేందుకు వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 90,645 మంది రైతులకు ఇప్పటి వరకు 51,649 మంది దరఖాస్తులు చేశారన్నారు. రైతులకు అందుబాటులో ఉండని ఏఈఓలను, వ్యవసాయశాఖ అధికారులకు తాఖీదులు ఇస్తామని అన్నారు. మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల నుంచి మహిళా రైతులు చిన్న పిల్లలతో పాటు వచ్చి ఎండలో వ్యవసాయ శాఖ అధికారుల కోసం ఎదురు చూస్తున్న విషయమై తాఖీదులు ఇస్తామన్నారు. ఏడీఏ రమేష్‌, నార్నూరు మండల వ్యవసాయశాఖ అధికారి పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని