కలత చెందిన కన్న ఊరు!

రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు అది. బాహ్య ప్రపంచానికీ పెద్దగా తెలియని పల్లె ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఉద్యోగం సాధించి కలలు నెరవేరుస్తానని చెప్పి వెళ్లిన యువకుడు అగ్నిపథ్‌ సికింద్రాబా

Published : 25 Jun 2022 06:57 IST

కుమ్మరితండాలో రోదిస్తున్న పడ్వాల్‌ యోగేశ్‌ కుటుంబ సభ్యులు

ఉట్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే : రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు అది. బాహ్య ప్రపంచానికీ పెద్దగా తెలియని పల్లె ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఉద్యోగం సాధించి కలలు నెరవేరుస్తానని చెప్పి వెళ్లిన యువకుడు అగ్నిపథ్‌ సికింద్రాబాద్‌ అల్లర్లతో చిక్కుకోవడంతో ఊరంతా కలత చెందుతోంది.  హైదరాబాద్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని కుమ్మరితండా ఇప్పుడు జాతీయ దర్యాప్తు దృష్టిలో పడింది.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం కుమ్మరితండాకు చెందిన పడ్వాల మోర్బాన్‌ గోదావరికి ముగ్గురు సంతానం. మోర్బాన్‌ లారీ డ్రైవర్‌గా చేస్తూ వారిని చదివించాడు. పెద్ద కుమారుడు నితేశ్‌ ఇంటర్‌ చదివి కుటుంబ పరిస్థితి బాగోలేక మధ్యలోనే ఆపేసి తండ్రితో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. తమ్ముడు యోగేశ్‌ను ఉన్నత చదువులు చదివించి  మంచి ఉద్యోగంలో చూడాలని కలలు కన్నారు. కూతురు దీపిక ఇంటర్‌ చదువుతూ తల్లితో కలిసి కూలీ పనులకు వెళ్తోంది. యోగేశ్‌ ఇంటర్‌ పూర్తి చేసి ఆర్మీ ఉద్యోగం సాధించాలని గ్రామస్థులకు, తోటి యువతకు తెలిపాడు. స్థానికులు గ్రామంలో పోగు చేసిన డబ్బు నుంచి శిక్షణకు అవసరమైన ఖర్చుకు డబ్బులు అందించారు. దాంతో ఆయన శిక్షణ పూర్తి చేశాడు. ఆదిలాబాద్‌లో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నాడు. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ ఎవరికి తెలియకుండా వెళ్లాడని కుటుంబ సభ్యులు తల్లి గోదావరి, చెల్లెలు దీపిక రోధిస్తూ తెలిపారు. తన కొడుకు అలాంటి వాడు కాదని వారు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తుంది. కుటుంబ సభ్యులు యోగేశ్‌ను కలిపించాలని అధికారులను వేడుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని