logo

అధికారుల తప్పిదం.. రైతులకు శాపం

వ్యవసాయ శాఖాధికారులు చేసిన తప్పిదం.. అన్నదాతలను తిప్పల పాలుచేసింది. ఇంద్రవెల్లి మండలంలోని పలువురు రైతులు యాసంగిలో శనగ సాగు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అధికారులు

Published : 25 Jun 2022 04:24 IST

సదాశివ్‌కు సొసైటీ పేరుతో ఇచ్చిన చెక్కు

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే : వ్యవసాయ శాఖాధికారులు చేసిన తప్పిదం.. అన్నదాతలను తిప్పల పాలుచేసింది. ఇంద్రవెల్లి మండలంలోని పలువురు రైతులు యాసంగిలో శనగ సాగు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అధికారులు నమోదు చేయకపోవడంతో వారికి అక్కడ విక్రయించడానికి వీలు కాలేదు. ప్రైవేటులో రూ.1000 వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని గుర్తించిన రైతులు అధికారుల సూచనల మేరకు ఆదివాసీ జన సంరక్షణ వెల్ఫేర్‌ సొసైటీకి విక్రయించారు. పంట అమ్మిన వారంలోగా డబ్బులు వస్తాయని చెప్పినా ఇప్పటికీ ఇవ్వలేదని వాపోతున్నారు. పంట అమ్మిన రైతులకు బ్యాంకులో చెల్లని చెక్కులు ఇచ్చారని రైతులు శుక్రవారం ఎమ్మెల్యే రేఖానాయక్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే వారి డబ్బులు ఇప్పించాలని ఎస్‌ఐ నాగ్‌నాథ్‌కు చరవాణిలో ఆదేశించారు. మండలంలో 70 మంది రైతులకు రూ.60 లక్షలు రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని