Corona: కాసిపేట గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. దాదాపు 10 నెలల తర్వాత కరోనా మహమ్మారి...

Published : 01 Jul 2022 20:35 IST

బెల్లంపల్లి పట్టణం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. దాదాపు 10 నెలల తర్వాత కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించింది. విద్యాసంస్థలు ప్రారంభం కావడం.. మహమ్మారి మళ్లీ సోకుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 350 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. ఒకే రోజు 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతుతున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ఇద్దరికి కరోనా సోకింది. దీంతో పాఠశాలలోని విద్యార్థులందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 9 మందికి నిర్థారణ అయింది. కరోనా బారిన పడిన విద్యార్థులను హోం క్వారంటైన్‌కు తరలించారు. మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరి అని  వైద్య సిబ్బంది సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని