logo

మోదీతోనే గ్రామాల్లో ప్రగతి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే గ్రామాల్లో ప్రగతి సాధ్యమైందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్‌ దేవ్‌ ఉద్ఘాటించారు. శుక్రవారం జైనథ్‌ మండల కేంద్రానికి భాజపా జిల్లా అధ్యక్షుడు....

Updated : 02 Jul 2022 07:23 IST


జైనథ్‌ ఆలయం వద్ద త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌కుమార్‌ దేవ్‌, పాయల్‌ శంకర్‌, చిట్యాల సుహాసినిరెడ్డి

జైనథ్‌, న్యూస్‌టుడే : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే గ్రామాల్లో ప్రగతి సాధ్యమైందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్‌ దేవ్‌ ఉద్ఘాటించారు. శుక్రవారం జైనథ్‌ మండల కేంద్రానికి భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డితో కలిసి వచ్చిన ఆయనకు భాజపా జిల్లా, మండల, గ్రామ నేతలు స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వరకు పాదయాత్రగా వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేకపూజలు చేసిన ఆయన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ఈవో వామన్‌రావు, ఉపసర్పంచి టి.రాకేశ్‌రెడ్డి సన్మానించారు. అనంతరం దళితాథిత్యం కార్యక్రమంలో భాగంగా భాజపా కార్యకర్తలు అల్లకొండ ఊశన్న, బిక్కి సంతోష్‌ ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. తేనీటి విందు స్వీకరించారు. ప్రధాని మోదీ నేరుగా పంచాయతీలకు నిధులు మంజూరు చేయడంతో పల్లెల్లో ప్రగతి కనిపిస్తోందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఆదినాథ్‌, వేణుగోపాల్‌, జిల్లా కార్యదర్శి విజయ్‌, కోశాధికారి రతన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రాందాస్‌, నేతలు రత్నాకర్‌రెడ్డి, ముకుంద్‌రావు, అస్తక్‌ సుభాష్‌, దోని జ్యోతి, ప్రతాప్‌యాదవ్‌, సామ రమేష్‌రెడ్డి, చిల్కూరి లింగారెడ్డి మండల, గ్రామ నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని