logo

కలుషితమా.. రసాయనమా..!

ఎప్పుడూ గలగలా పారే సుద్దవాగులో శుక్రవారం ఏవైనా ఫ్యాక్టరీల నుంచి రసాయనాలు వదిలారో.. లేదంటే కలుషిత పదార్థాలు కలిశాయో తెలియదుగాని నీటిపై తెల్లటి నురగలు కనిపించాయి. లోకేశ్వరం-అర్లి రహదారిలోని వంతెనపై నుంచి ప్రయాణించే వారంతా నురగలు చూసి ఆశ్చర్చానికి లోనయ్యారు. దగ్గర

Published : 06 Aug 2022 04:59 IST

ఎప్పుడూ గలగలా పారే సుద్దవాగులో శుక్రవారం ఏవైనా ఫ్యాక్టరీల నుంచి రసాయనాలు వదిలారో.. లేదంటే కలుషిత పదార్థాలు కలిశాయో తెలియదుగాని నీటిపై తెల్లటి నురగలు కనిపించాయి. లోకేశ్వరం-అర్లి రహదారిలోని వంతెనపై నుంచి ప్రయాణించే వారంతా నురగలు చూసి ఆశ్చర్చానికి లోనయ్యారు. దగ్గర నుంచి చూస్తే నీటిపై తెల్లటి నురగ, దూరం నుంచి చూస్తే నీటిపై మబ్బులు వాలినట్లుగా కనిపించడంతో కాసేపు ఆగి పరిశీలించారు. ఇదే విషయాన్ని గడ్డెన్న వాగు డీఈఈ శ్రీనివాస్‌ను ‘న్యూస్‌టుడే’ అడగ్గా ప్రాజెక్టు నుంచి ఒక్క గేటు ద్వారా నీటిని వదిలామని, ప్రాజెక్టు వద్ద ఎలాంటి నురగ లేదని, ఎప్పటిలాగే నీరుందన్నారు. పట్టణం దాటిన తర్వాత ఏం కలిసిందో తెలియదన్నారు.

-న్యూస్‌టుడే, లోకేశ్వరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని