logo

ఆత్మీయ వేడుక.. అనురాగాల వీచిక

సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని శుక్రవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని తోబుట్టువులు పుట్టింటికి వచ్చి తమ సోదరులకు రాఖీ కట్టారు. సోదరులు ఆడబిడ్డలకు కట్న కానుకలు సమర్పించి వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.

Published : 13 Aug 2022 05:37 IST

సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి రాఖీ కడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, మహిళ సభ్యులు; కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు రాఖీ కడుతున్న కోవ లక్ష్మి

సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని శుక్రవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని తోబుట్టువులు పుట్టింటికి వచ్చి తమ సోదరులకు రాఖీ కట్టారు. సోదరులు ఆడబిడ్డలకు కట్న కానుకలు సమర్పించి వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. పట్టణం, గ్రామాల్లో రక్షాబంధన కార్యక్రమంతో సంబరాలు చేసుకున్నారు. వజ్రోత్సవాల నేపథ్యంలో వచ్చిన ఈ పండగకు మరింత ప్రాశస్త్యం పెరిగింది. అటు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ప్రతినిధులు, యంత్రాంగం జాతీయ సమైక్యతా రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్ర పటానికి జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఇతర ఆడపడచులు రాఖీ కట్టారు. పాలనాధికారి రాహుల్‌రాజ్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇతర ప్రజా ప్రతినిధులకు జడ్పీ ఛైర్‌పర్సన్‌ రాఖీ కట్టి మిఠాయి అందించారు. పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రత్యేక ఉప ఉన్నత కారాగారంలో రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. విచారణ ఖైదీలకు మహిళ సిబ్బంది రాఖీలు కట్టారు.
- న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని