logo

జీవనాధారం తీసుకొని గాలికొదిలేశారు

నిరుపేద గిరిజనులకు అన్నం పెట్టే మూడు ఎకరాల భూమిని అధికారులు ఎనిమిది సంవత్సరాల క్రితం తీసుకున్నారు. రూ.13 లక్షల చెల్లిస్తామని అవార్డ్‌ సైతం ప్రకటించారు. వారి స్థలంలో నీళ్ల ట్యాంకు, సంపు నిర్మించారు. కానీ నేటికీ నయాపైసా పరిహారం అందలేదు

Published : 13 Aug 2022 05:37 IST

పట్టాపాసు పుస్తకంతో కుమురం సూర్య దంపతులు

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: నిరుపేద గిరిజనులకు అన్నం పెట్టే మూడు ఎకరాల భూమిని అధికారులు ఎనిమిది సంవత్సరాల క్రితం తీసుకున్నారు. రూ.13 లక్షల చెల్లిస్తామని అవార్డ్‌ సైతం ప్రకటించారు. వారి స్థలంలో నీళ్ల ట్యాంకు, సంపు నిర్మించారు. కానీ నేటికీ నయాపైసా పరిహారం అందలేదు. నడిచే సత్తువ లేకున్నా, వీరిద్దరు నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని మానిక్‌గూడ గ్రామానికి చెందిన కుమురం సూర్యకు సర్వే నంబర్‌ 139/11/1 లో 3.15 ఎకరాల భూమి ఉంది. నా అనేవారు ఎవరూ లేని వీరికి ఈ భూమే జీవనాధారం. 2014లో ఈ భూమిని తీసుకున్న గ్రామీణ నీటి సరఫరా అధికారులు (ప్రస్తుతం మిషన్‌ భగీరథ) మూడు ఎకరాల్లో వివిధ నిర్మాణాలను పూర్తి చేశారు. సంపు, ట్యాంకు నిర్మించినందుకు గుత్తేదారుకు డబ్బులు చెల్లించిన అధికారులు, భూమి ఇచ్చిన వృద్ధులను మాత్రం గాలికొదిలేశారు. డబ్బులు ఇప్పించడయ్యా అంటూ వీరు ఇరువురు జిల్లా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని