logo

వజ్రోత్సవం.. ఐక్యతా రాగం..

ఊరూవాడ, పల్లేపట్టణం జాతీయ జెండాలతో ఒక్కసారిగా కదిలి వచ్చింది. చిన్నా పెద్ద భేదం లేకుండా అందరూ స్వాతంత్య్ర వజ్రోత్సవానికి తరలివచ్చారు. ర్యాలీగా వెళ్లి ఒకేచోట చేరారు. వందేమాతరం, భారతమాతాకి జై అంటూ ఐక్యతా రాగాన్ని వినిపించి

Published : 14 Aug 2022 03:09 IST

పండగలా ఫ్రీడం ర్యాలీ..

ఆదిలాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే

జాతీయ జెండాలతో ఫ్రీడం ర్యాలీలో పాల్గొన్న జనాలు

ఊరూవాడ, పల్లేపట్టణం జాతీయ జెండాలతో ఒక్కసారిగా కదిలి వచ్చింది. చిన్నా పెద్ద భేదం లేకుండా అందరూ స్వాతంత్య్ర వజ్రోత్సవానికి తరలివచ్చారు. ర్యాలీగా వెళ్లి ఒకేచోట చేరారు. వందేమాతరం, భారతమాతాకి జై అంటూ ఐక్యతా రాగాన్ని వినిపించి పులకించిపోయారు. దేశభక్తి పాటలపై నృత్యాలు చేశారు. కేరింతలు కొట్టారు. మనసును దోచే ఈ మనోహర దృశ్యానికి జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణం వేదికైంది. శనివారం జిల్లా కేంద్రంలోని 49 వార్డుల నుంచి జనాలు, మాజీ సైనికులు, ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్‌సీసీ, స్కౌట్స్‌, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అంతా త్రివర్ణ పతాకాలు చేతపట్టుకొని కుమురంభీం, ఎన్టీఆర్‌ కూడళ్లకు చేరుకున్నారు. పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ఫ్రీడం ర్యాలీని ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణానికి చేరుకున్న ఈ ఫ్రీడం ర్యాలీ పండగలా తలపింపజేసింది. ఈసందర్భంగా త్రివర్ణాలతో ఉన్న బెలూన్లను అతిథులు గాలిలో ఎగురవేశారు. బాణాసంచా కాల్చి సంబరాల్లో మునిగితేలారు. ఈ నెల 22 వరకు జరిగే ఆయా కార్యక్రమాల్లోనూ ఇదే అంకితభావం చూపాలని, స్వచ్ఛందంగా పాల్గొనాలని, స్వాతంత్య్ర సమరంలో అమరులైన, జైలు జీవితం గడిపిన వారిని స్మరించుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో 75 మీటర్ల జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సహాయ పాలనాధికారి నటరాజ్‌, ఆర్డీఓ రమేష్‌ రాఠోడ్‌, డీఆర్‌డీఏ పీడీ కిషన్‌, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, డీఎస్పీ ఉమేందర్‌ ఉన్నారు.

ర్యాలీలో పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, ఎస్పీ

ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు


మువ్వన్నెల జెండాను ఎగురవేస్తూ భారత మాతా కి

జై అంటూ నినాదాలు చేస్తున్న విద్యార్థినులు

త్రివర్ణ శోభితం.. ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని