logo

వన్నె తగ్గని నినాదం.. జైజవాన్‌--జైకిసాన్‌

జవాన్‌..దేశానికి రక్షకుడు..సరిహద్దులో ఉంటూ దేశ రక్షణకు రాత్రనక పగలనక కష్టపడుతున్న సైనికుడు. బ్రిటిషు వారినుంచి స్వాతంత్య్రం పొందేందుకు ఎందరో నాయకులు, పౌరులు తమ ప్రాణాలను త్యాగం చేస్తే ఇప్పుడు మనం ఆ ఫలాలను అనుభవిస్తున్నాం

Published : 14 Aug 2022 03:09 IST

జవాన్‌..దేశానికి రక్షకుడు..సరిహద్దులో ఉంటూ దేశ రక్షణకు రాత్రనక పగలనక కష్టపడుతున్న సైనికుడు. బ్రిటిషు వారినుంచి స్వాతంత్య్రం పొందేందుకు ఎందరో నాయకులు, పౌరులు తమ ప్రాణాలను త్యాగం చేస్తే ఇప్పుడు మనం ఆ ఫలాలను అనుభవిస్తున్నాం.త్యాగాలతో తెచ్చుకున్న స్వతంత్ర భారతాన్ని ముష్కరులు, విదేశీయుల నుంచి కాపాడేందుకు జవాన్లు శ్రమిస్తున్నారు.1965లో మన దేశానికి పాకిస్థాన్‌ మధ్య యుద్ధం వచ్చినప్పుడు నాటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జవాన్లలో ఉత్సాహం నింపేందుకు ‘జై జవాన్‌-జైకిసాన్‌’ అనే నినాదం ఇచ్చారు.. పౌరుల ఆకలి తీర్చి అన్నం పెట్టడంలో అన్నదాత పాత్ర ఎంతో.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్ల పాత్ర కూడా గొప్పది అంటూ వీరిలో ఉత్సాహం నింపారు..అప్పటి నుంచి స్వాతంత్య్ర వేడుకలు వచ్చాయంటే చాలు పిల్లలు, పెద్దలు ప్రతీచోట ఈ నినాదం మారుమోగుతోంది. - న్యూస్‌టుడే, దండేపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని