logo

వీరుల వారసులకు సన్మానం

‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా కేంద్రం స్వాతంత్య్ర సమరయోధులతో పాటు హక్కుల సాధనకు ఉద్యమించిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి వారసులను సన్మానిస్తోంది. అందులో భాగంగా జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం

Published : 14 Aug 2022 03:09 IST

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు

కుమురం భీం చిత్రపటాన్ని అందిస్తున్న సోనేరావు

‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా కేంద్రం స్వాతంత్య్ర సమరయోధులతో పాటు హక్కుల సాధనకు ఉద్యమించిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి వారసులను సన్మానిస్తోంది. అందులో భాగంగా జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆదివాసీ యోధుడు కుమురం భీం స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులను కేంద్ర రైల్వేశాఖ ఆధ్వర్యంలో దిల్లీలో సన్మానించారు. కేంద్ర రైల్వేశాఖ ఆహ్వానం మేరకు ఇటీవల రాజధానికి వెళ్లిన కుమురం భీం మనుమడు సోనేరావును శనివారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఘనంగా సన్మానించారు. అనంతరం రైల్వే మంత్రికి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించినట్లు సోనేరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. - న్యూస్‌టుడే, సిర్పూర్‌(యు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని