logo

ఒక్కటయ్యే వేళ.. ఉప్పొంగిన జాతీయత.!

సాధారణంగా పెళ్లి అనగానే బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాలు వినిపిస్తాయి. ఆదిలాబాద్‌ పట్టణ శివారులో ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన వివాహ వేడుకలో జనగణమన జాతీయగీతం, భారతమాతాకీ జై నినాదాలు మారుమోగాయి. 75ఏళ్ల అమృతోత్సవ

Published : 14 Aug 2022 03:09 IST

సాధారణంగా పెళ్లి అనగానే బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాలు వినిపిస్తాయి. ఆదిలాబాద్‌ పట్టణ శివారులో ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన వివాహ వేడుకలో జనగణమన జాతీయగీతం, భారతమాతాకీ జై నినాదాలు మారుమోగాయి. 75ఏళ్ల అమృతోత్సవ వేళ పట్టణంలోని భాగ్యనగర్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఎల్మల్‌వార్‌ సాయినాథ్‌, మహారాష్ట్ర ధర్మాబాద్‌కి చెందిన అభిజ్ఞ పెళ్లి వేడుకను ప్రత్యేకంగా జరుపుకొన్నారు. ముందుగా వారు జాతీయజెండాలు చేతబట్టి, హాజరైన బంధువులు, అతిథులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఆ తరువాతే ఒక్కటయ్యారు. - ఈనాడు, ఆదిలాబాద్‌, న్యూస్‌టుడే, భీంపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు