logo

ఉప్పొంగిన దేశభక్తి.. దశదిశలా స్ఫూర్తి

బ్రిటీషు పాలన విముక్తి కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడమే వజ్రోత్సవాల ఉద్దేశమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం నుంచి జడ్పీ

Published : 14 Aug 2022 03:09 IST

పట్టణంలో భారీ ర్యాలీ.. ఉత్సాహంగా పాల్గొన్న యంత్రాంగం

ద్విచక్ర వాహన ర్యాలీలో మంత్రి ఐకేరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ

లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎస్పీ కె.సురేష్‌కుమార్‌,

ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: బ్రిటీషు పాలన విముక్తి కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడమే వజ్రోత్సవాల ఉద్దేశమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్‌, పాలనాధికారి రాహుల్‌రాజ్‌, ఎస్పీ కె.సురేష్‌కుమార్‌, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీఎఫ్‌వో దినేష్‌కుమార్‌, అదనపు పాలనాధికారులు రాజేశం, చాహత్‌బాజ్‌పాయి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలు పట్టుకొని ద్విచక్ర వాహనాలపై, విద్యార్థులు ప్లకార్డులతో పాదయాత్రగా జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లగుండా సాగిన ప్రదర్శన ఆకట్టుకుంది. జాతీయ జెండాలు చేత పట్టుకొని.. ‘బోలో స్వాతంత్య్ర భారత్‌కి జై.. అంటూ సాగిన నినాదాలతో పట్టణం మార్మోగింది. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా జాతీయ భావాన్ని చాటేలా సాగిన ప్రదర్శన పండగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం గురుకుల పాఠశాలకు చేరుకొని వజ్రోత్సవాల ప్రాధాన్యతను మంత్రి వివరించారు. 75 ఏళ్ల భారతావని ఆవిర్భావం ఎలా జరిగింది? దాని వెనుకు ఎంత మంది కృషి దాగి ఉంది? ఎంత మంది ఆత్మ త్యాగాలు చేశారు? ఎలాంటి ఆయుధాలు లేకుండా అహింసా మార్గంలో దేశాన్ని సాధించుకున్న తీరు.. ఇవన్నీ నేటి తరానికి పెద్దగా తెలియడంలేదన్నారు. ఇలాంటి మహోన్నతమైన అంశాలు భావి పౌరులకు చేరవేయాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ ఈ నెల 8 నుంచి 22 వరకు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సూచించారన్నారు. అందుబాటులో ఉన్న అన్ని సినిమా థియేటర్‌లలో గాంధీ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేసేలా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర పాలనలోనూ అన్నివిధాలా నష్టపోతున్న విషయాన్ని గమనించిన కేసీఆర్‌.. ప్రత్యేక రాష్ట్ర సాధనకు కంకణం కట్టుకొని సఫలీకృతుడయ్యాడని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువైందని, ఆగస్టు 15 నుంచి 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛను వస్తుందని, జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయడంతో మెరుగైన వైద్యం దరిచేరుతుందన్నారు. ఈ నెల 21న హరితహారం నిర్వహించి అందరు మొక్కలు నాటాలని సూచించారు.

అనంతరం పాలనాధికారి రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో వజ్రోత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటూ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో మిగతా కార్యక్రమాలు జయప్రదం చేయాలన్నారు. అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌, డీఆర్‌వో సురేష్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి మంత్రికి, ఎమ్మెల్సీకి రాఖీ కట్టారు.

జాతీయ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు


75 ఆకారంలో కూర్చున్న విద్యార్థులు


ద్విచక్రవాహన ర్యాలీలో పాలనాధికారి రాహుల్‌రాజ్‌ దంపతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని