logo

ఎదనిండా.. ఎగిసే జెండా

బెల్లంపల్లి పట్టణంలో జాతీయ జెండా మురిసింది. పట్టణమంతా జాతీయ జెండాలతో పరుగులు తీసింది. ఏసీపీ ఎడ్ల మహేష్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర 75వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలో సామూహిక జాతీయ గీతాలాపనతో

Published : 14 Aug 2022 03:09 IST

బెల్లంపల్లి: వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

బెల్లంపల్లి పట్టణం, మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే : బెల్లంపల్లి పట్టణంలో జాతీయ జెండా మురిసింది. పట్టణమంతా జాతీయ జెండాలతో పరుగులు తీసింది. ఏసీపీ ఎడ్ల మహేష్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర 75వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలో సామూహిక జాతీయ గీతాలాపనతో పాటు మహార్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు భారీ ఎత్తున ఏఎంసీ మైదానానికి తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎంపీ వెంకటేష్‌ నేత, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ విఠల్‌, జిల్లా పాలనాధికారి భారతి హోళ్లికేరి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. 25 వేల మందితో సామూహిక గీతాలాపన చేసినందుకు ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పించినట్లు ఆ సంస్థ ప్రతినిధి జ్యోతి ప్రకటించారు. ఎంపీ వెంకటేష్‌ నేత హిందీలో దేశభక్తి పాట పాడి ఆశ్చర్యపరిచారు. విద్యార్థులు దేశభక్తి గీతాలకు చేసిన నృత్యాలు ఉర్రూతలూగించాయి. మహార్యాలీని అతిథులు ప్రారంభించారు. ఏఎంసీ మైదానం నుంచి పాతబస్టాంబడ్‌ వరకు 120 మీటర్ల మూడు రంగుల జెండాలో మహార్యాలీ చేపట్టారు. ఇన్‌ఛార్జి డీసీపీ అఖిల్‌ మహాజన్‌, డీఎఫ్‌ఓ శివాని డోంగ్రే, గ్రంథాలయసంస్థ జిల్లా ఛైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, ఆర్డీఓ శ్యామలదేవి తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాలలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు

మంచిర్యాలలో..

మంచిర్యాల పట్టణం: స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని పాలనాధికారి భారతి హోళ్లికేరి అన్నారు. మంచిర్యాలలోని ఐబీ నుంచి జిల్లా పరిషత్‌ పాఠశాల మైదానం వరకు శనివారం పోలీస్‌ శాఖ నిర్వహించిన భారీ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలు పట్టుకొని పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై..అంటూ చేసిన నినాదాలతో మంచిర్యాల పట్టణం దద్ధరిల్లింది. ర్యాలీలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, జిల్లా ఇన్‌ఛార్జి పోలీస్‌ అధికారి అఖిల్‌ మహాజన్‌, జిల్లా అటవీ శాఖ అధికారి శివాణి డోంగ్రే, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ నారాయణ నాయక్‌ తదితరులు జాతీయ జెండాలు పట్టుకొని పాల్గొన్నారు.

బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో జాతీయ జెండాలతో విద్యార్థులు, ప్రజలు

బెల్లంపల్లి: మాట్లాడుతున్న ఎంపీ వెంకటేష్‌నేత, చిత్రంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని