logo

పతాక స్ఫూర్తి.. సమున్నత కీర్తి

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా దేశ సమున్నత కీర్తిని, తిరంగ సూర్తిని చాటేలా శనివారం జిల్లా కేంద్రంలో భారీ ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్‌ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కొత్త బస్టాండ్‌, మినీ ట్యాంక్‌ బండ్‌, పాత

Published : 14 Aug 2022 03:09 IST

జిల్లా కేంద్రంలో భారీ ఫ్రీడం ర్యాలీ

ఎన్టీఆర్‌ మినీ స్టేడియం గ్యాలరీపై రంగుల్లో విద్యార్థులు, అధికారులు

నిర్మల్‌, న్యూస్‌టుడే : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా దేశ సమున్నత కీర్తిని, తిరంగ సూర్తిని చాటేలా శనివారం జిల్లా కేంద్రంలో భారీ ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్‌ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కొత్త బస్టాండ్‌, మినీ ట్యాంక్‌ బండ్‌, పాత బస్టాండ్‌, చింతకుంటవాడ, కస్భా, నగరేశ్వరవాడ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీదుగా సాగింది. జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ పారుఖీ, ఇన్‌ఛార్జి ఎస్పీ కిరణ్‌ఖరె, అదనపు పాలనాధికారులు రాంబాబు, హేమంత్‌ బోర్కడే, మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, వేల సంఖ్యలో పాఠశాలలు, కళాశాలల, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల అధికారులు, సిబ్బంది, అధ్యాపకులు, ఉపాధ్యాయులు మువ్వన్నెల జెండా పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అందరిలోనూ మది నిండా జాతీయతా భావం ఉప్పొంగి చిరునవ్వులు కనిపించాయి. జై జవాన్‌.. జై కిసాన్‌, భారత్‌ మాతాకీ జై, వందేమాతరం అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు ‘పుర’ వీధుల్లో మార్మోగాయి. కిలోమీటర్ల పొడవునా సాగిన ర్యాలీ ఆద్యంతం త్రివర్ణ శోభితం కనిపించింది. ఆయా కూడళ్లలో కాలనీ పెద్దలు, మహిళలు పాల్గొని దేశభక్తిని చాటారు. సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులు పావురాలు, మూడు రంగుల బెలూన్లను గాలిలో వదిలినప్పుడు విద్యార్థులు, తిలకించిన వారందరి కరతాళ ధ్వనులతో ఎన్టీఆర్‌ మినీ స్టేడియం మైదానం మార్మోగింది. జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75 సంత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రతి ఇంటికి మువ్వన్నెల జెండా పంపిణీ చేశామని, అందరూ ఇళ్లపై జెండాలను ఎగురవేయాలన్నారు. ఫ్రీడం ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. సోమవారం నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి, అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

కుంటాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తదితరులు

ఫ్రీడం ర్యాలీలో పాల్గొన్న జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ, ఇన్‌ఛార్జి ఎస్పీ కిరణ్‌ఖారె,

అదనపు పాలనాధికారులు రాంబాబు, హేమంత్‌ బోర్కడే, మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌


భైంసా: ర్యాలీలో సీఐ ఎం.ప్రవీణ్‌కుమార్‌, బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.రఘు తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని