logo

రాష్ట్రంలోనే తొలి డిపో

నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హైదరాబాద్‌ సంస్థానంలో రవాణా సదుపాయాన్ని మెరుగు పరిచేందుకు 1932లో నిజాం స్టేట్‌ రైల్వే అండ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్టు డిపార్డ్‌మెంట్‌ను సికింద్రాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు.

Published : 15 Aug 2022 05:11 IST


1932లో ఆసిఫాబాద్‌ డిపోకు వచ్చిన ఆల్బేనియం మినీ బస్సు

ఆసిఫాబాద్‌ అర్బన్‌ : నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హైదరాబాద్‌ సంస్థానంలో రవాణా సదుపాయాన్ని మెరుగు పరిచేందుకు 1932లో నిజాం స్టేట్‌ రైల్వే అండ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్టు డిపార్డ్‌మెంట్‌ను సికింద్రాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఇంగ్లండ్‌  నుంచి 27 ఆల్బేనియం బస్సులను తెప్పించారు. 1932లోనే హైదరాబాద్‌ రాష్ట్రంలో తొలి మూడు బస్సు డిపోలను ప్రారంభించారు. అందులో కొత్తపేట, ఉప్పల్‌తో పాటు ఆసిఫాబాద్‌లో బస్సు డిపోను ఏర్పాటు చేయడం గమనార్హం. తొలిసారిగా ఇంగ్లండ్‌ నుంచి తెప్పించిన మూడు ఆల్బేనియం బస్సులు ఆసిఫాబాద్‌కు వచ్చాయి. కేవలం పదమూడు మంది ప్రయాణికులు కూర్చుండే మినీ బస్సులు అవి. రెండు హైదరాబాద్‌ రూట్లో, ఒకటి ఆదిలాబాద్‌ రూట్లో నడిపించేవారని నాటితరం వారు చెబుతారు. నిజాం రాష్ట్రంలో తొలి మూడు డిపోల్లో ఒకటిగా ఉన్న ఆసిఫాబాద్‌ డిపో ఇప్పటికీ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని