logo

బాసరలో భక్తుల సందడి

శ్రావణ మాసం, ఆదివారం సెలవుల దినం కావడంతో బాసర అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలిరావచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Published : 15 Aug 2022 05:26 IST

833 అక్షరాభ్యాసాలు


చిన్నారికి అక్షరాభ్యాసం చేస్తున్న వేదపండితుడు

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: శ్రావణ మాసం, ఆదివారం సెలవుల దినం కావడంతో బాసర అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలిరావచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రూ.1000 అక్షరాభ్యాసాలు 435, రూ.100వి 398 జరిగాయి. సుమారుగా ఆలయానికి రూ.5.6 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.


అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు