logo

రాతికోటలు..రక్షణ నిలయాలు

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ తన ఆధీనంలోని ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొంత భాగమైన నైజాం ప్రాంతాన్ని మినీ పాకిస్థాన్‌గా మార్చేందుకు సిద్ధమయ్యాడు.

Published : 15 Aug 2022 05:26 IST


ఏల్వి మిగిలిన రాతి కోట గోడ

తానూరు, న్యూస్‌టుడే: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ తన ఆధీనంలోని ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొంత భాగమైన నైజాం ప్రాంతాన్ని మినీ పాకిస్థాన్‌గా మార్చేందుకు సిద్ధమయ్యాడు. దాంతో తెలంగాణ సాయుధ పోరాటం ఊపందుకోవడంతో పాటు భారత ప్రభుత్వం సైనికచర్య ప్రారంభించింది. దీంతో ఖాసీం రజ్వీ నేతృత్వంలోని నిజాం ప్రైవేటు సైన్యం(రజాకార్లు) తెలంగాణలోని పల్లెల్లో విధ్వంసం సృష్టించారు. అప్పటికే కొన్ని గ్రామాల్లో దేశ్‌పాండేలు, దేశ్‌ముఖ్‌లు, జమీందార్లు నిర్మించిన రాతి కోటలు ప్రజలకు రజాకార్ల నుంచి రక్షణ కల్పించాయని పెద్దలు చెబుతుంటారు. రజాకార్లు గ్రామాల్లోకి వచ్చిన వెంటనే ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆ రాతి కోటల్లో తలదాచుకునేవారు. అలాంటి కోటలు నిర్మల్‌ జిల్లాలోని తానూరు, ఏల్వి, బెంబర్‌తో పాటు ముథోల్‌, బాసర, కుభీరు మండలంలోని పల్సిలో ఉండేవని, ఇప్పుడు అవి పూర్తిగా నేలమట్టమయ్యాయని వారు పేర్కొంటున్నారు. ఏల్విలో ప్రస్తుతం కేవలం రాతి గోడ మాత్రమే మిగిలి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని