logo

పండగ వేడుక.. పర్యాటకుల సందడి

పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీలో పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దసరా, దీపావళి సెలవులను ఆహ్లాదకర వాతావరణంలో ఆస్వాదించాలనుకొనే వారి కోసం....

Published : 25 Sep 2022 06:41 IST

రామోజీ ఫిల్మ్‌సిటీలో కోలాహలం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీలో పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దసరా, దీపావళి సెలవులను ఆహ్లాదకర వాతావరణంలో ఆస్వాదించాలనుకొనే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రామోజీ ఫెస్టివ్‌ సెలబ్రేషన్స్‌ ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపకాంతుల వెలుగుల్లో ఫిల్మ్‌సిటీ అందాలు సరికొత్తగా కనిపిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు ఈ ప్రత్యేక సంబరాలు కొనసాగుతాయి. కలల లోకంలో తేలియాడేలా చేసే కార్నివాల్‌ పరేడ్‌లో పాల్గొంటూ.. ఫిల్మ్‌సిటీ వీధుల్లో విహరిస్తూ సందర్శకులు ఆనందతీరాలకు చేరుతున్నారు. ప్రకృతి రమణీయ ఉద్యానవనాల సందర్శన, కిలకిలారావాల పక్షుల పార్కు, సీతాకోకచిలుకల పార్కు సందర్శనతో మర్చిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకుంటున్నారు. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే యాక్షన్‌ ప్యాక్డ్‌ స్టంట్‌ షో, రైడ్స్‌, ఆకట్టుకొనే స్టేజ్‌ షోలు, మైమరిపించే సంగీతం సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. బాహుబలి సెట్‌ సందర్శన మరో ఆకర్షణగా నిలుస్తోంది. వినోదం, విహారంతో పాటు పండగ రుచులతో అందించే విందు ప్రత్యేకతను చాటుతోంది.


నృత్యాలతో హోరెత్తిస్తున్న కళాకారులు

సాయంత్రం వేళ దాండియా ఆటలు..  రామోజీ ఫెస్టివ్‌ సెలబ్రేషన్స్‌కు సాయంత్రం వేళ విచ్చేస్తున్న పర్యాటకులు దాండియా ఆటల్లో పాలుపంచుకుంటూ ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. డీజే దాండియా ఆట పాటల్లో ఆడుతూ పాడుతూ గడుపుతున్నారు. సన్‌ ఫౌంటెయిన్‌ డ్యాన్స్‌ ఫ్లోర్‌లో డీజే బీట్‌లకు అనుగుణంగా నర్తిస్తూ ఆనందిస్తున్నారు. విభిన్న ప్రాంతీయ రుచులతో అందించే విందును ఆస్వాదిస్తున్నారు. సాయంత్రం వేళ పండగ సెలవులను ఆహ్లాదంగా గడపాలనుకునే వారికి ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఆస్వాదించాలనుకుంటే... ఈ సెలబ్రేషన్స్‌ను మీరు ఆస్వాదించాలనుకుంటే డే, ఈవెనింగ్‌ ప్యాకేజీలను ఎంచుకొని రావచ్చు. సాధారణ, ప్రీమియం సహా అనేక ప్యాకేజీలు స్వాగతం పలుకుతున్నాయి. ఆకర్షణీయమైన స్టే ప్యాకేజీలతో లగ్జరీ హోటల్‌ సితార, కంఫర్ట్‌ హోటల్‌ తారా, శాంతినికేతన్‌, వసుంధర విల్లా, గ్రీన్స్‌ ఇన్‌, హోటల్‌ సహారాలో విడిది చేసే వీలుంటుంది. అంతేకాదండోయ్‌.. పర్యాటకులు తిరిగి వెళ్లే సమయంలో ఫిల్మ్‌సిటీ నుంచి ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు రవాణా సౌకర్యం ఉంటుంది. నిర్దేశించిన రుసుం చెల్లించి వినియోగించుకోవచ్చు.


వీక్షిస్తున్న సందర్శకులు

మరిన్ని వివరాలకు..

ఫోన్‌ నంబరు 1800 120 2999 లేదా www.ramojifilmcity.com

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు