logo

దసరా వేడుకలకు సర్వం సిద్ధం

దసరా వేడుకకు జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ప్రాంగణం ముస్తాబైంది. నూతనంగా ఆలయం నిర్మాణం జరుగుతుండటంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన చేయలేదు.

Published : 05 Oct 2022 04:11 IST


మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో రావణాసురుడి ప్రతిమ దహన ఏర్పాట్లు 

నిర్మల్‌, న్యూస్‌టుడే: దసరా వేడుకకు జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ప్రాంగణం ముస్తాబైంది. నూతనంగా ఆలయం నిర్మాణం జరుగుతుండటంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన చేయలేదు. ఆలయ ప్రాంగణంలో దుర్గామాతను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మున్సిపల్‌, విశ్వహిందూ పరిషత్‌, మహాలక్ష్మి ఆలయ కమిటీ, బంగల్‌పేట్‌ ఆంజనేయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. దారిపొడవునా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బారికేడ్లు నిర్మించారు. బుధవారం సాయంత్రం శమీ పూజ, రావణ దహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


భైంసాలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తున్న ఏఎస్పీ కిరణ్‌ఖరే, సీఐ ఎం.ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు, పోలీసులు

శాంతిభద్రతలకు సహకరించండి..
భైంసా పట్టణం: భైంసాలో పండగలు, ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు సహాకరించాలని ఏఎస్పీ కిరణ్‌ఖరే అన్నారు. దసరా పండగ, దమ్మచక్రపరివర్తన దినోత్సవం, దుర్గామాత నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకుని మంగళవారం పట్టణ పోలీసులు నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీని ప్రారంభించారు. 350 మంది పోలీసులు, అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, 130 సీసీ కెమెరాలతో అనుసంధానించిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. పట్టణవాసులు సంఘ విద్రోహశక్తులకు అవకాశం కల్పించవద్దన్నారు. సీఐ ఎం.ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు, పోలీసులు, సబ్‌బెటాలియన్‌ బలగాలు పాల్గొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని