logo

ధర్మానికి అండగా నిలబడాలి

పోలీసులు ధర్మానికి అండగా నిలబడాలని జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. విజయ దశమి పరమార్థం కూడా దుష్ట సంహారమేనన్నారు.

Published : 05 Oct 2022 04:11 IST


ఆయుధ పూజలో పాల్గొన్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : పోలీసులు ధర్మానికి అండగా నిలబడాలని జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. విజయ దశమి పరమార్థం కూడా దుష్ట సంహారమేనన్నారు. విజయ దశమిని పురస్కరించుకొని పోలీసు సాయుధ భండాగారంలో మంగళవారం ఆయన ఆయుధ పూజ చేశారు. పోలీసు హెడ్‌క్వార్టర్‌లో వివిధ విభాగాల్లోని వాహనాలకు, డాగ్‌స్క్వాడ్‌, బీడీ టీం, ఎంటీ విభాగాల్లో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి సాక్షిగా రక్షణ, భద్రత వ్యవస్థను విజయవంతంగా కొనసాగించాలని సూచించారు. అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ ఉమేందర్‌, సీఐలు పి.సురేందర్‌, కే.శ్రీధర్‌, కే.మల్లేష్‌, బి.రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.

పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్‌ నేర విభాగం: విజయదశమిని పురస్కరించుకొని జిల్లాలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో పోలీసు అధికారులతో ఈ విషయమై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఐలు గుణవంతరావు, కృష్ణమూర్తి, ఆర్‌ఐలు వెంకటి, శ్రీపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts