logo

ఎస్టీ హోదా కల్పిస్తే జాతీయ స్థాయిలో మద్దతు

అన్ని రంగాల్లో వెనుకబడిన మాలీ కులస్థులకు తెలంగాణలో ఎస్టీ హోదా కల్పిస్తే జాతీయ స్థాయిలో మీ పార్టీకి మద్దతు ఇస్తామని ఆ సంఘం నాయకులు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు తెలిపారు.

Published : 05 Oct 2022 04:36 IST


ఎమ్మెల్యేకు మాలీల సర్వే పుస్తకాన్ని అందజేస్తున్న సంఘ నాయకులు

ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే : అన్ని రంగాల్లో వెనుకబడిన మాలీ కులస్థులకు తెలంగాణలో ఎస్టీ హోదా కల్పిస్తే జాతీయ స్థాయిలో మీ పార్టీకి మద్దతు ఇస్తామని ఆ సంఘం నాయకులు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు తెలిపారు. తమ డిమాండ్ల దస్త్రాన్ని సీఎం వద్దకు చేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మాలీల సమగ్ర సర్వే వివరాలతో ముద్రించిన పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌, రాష్ట్ర కోశాధికారి సతీష్‌, జిల్లా అధ్యక్షుడు విజయ్‌, సర్పంచి వివేక్‌, నాయకులు వామన్‌ ప్రధాన్‌, దీపక్‌షిండే, దాదారావు షిండే, సోనులే కిషన్‌, జనార్దన్‌, జిల్లా పట్లే సంఘం అధ్యక్షుడు గంగారాం, నాగోషే ఉత్తం, సుధాకర్‌ నాగోషీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని