logo

సుక్క.. ముక్క.. ఎంచక్కా..!

దసరా పండగ వేళ..విపణి దశ మారుతోంది. జిల్లాలో పండగకు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా. జిల్లాలో 73 మద్యం దుకాణాలు, 18 బార్లు ఉన్నాయి.

Published : 05 Oct 2022 04:36 IST


వేంపల్లిలో మేకలమండి వద్ద సందడి

మంచిర్యాలఅర్బన్‌, న్యూస్‌టుడే: దసరా పండగ వేళ..విపణి దశ మారుతోంది. జిల్లాలో పండగకు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా. జిల్లాలో 73 మద్యం దుకాణాలు, 18 బార్లు ఉన్నాయి. వీటికి హాజీపూర్‌ మండలం గుడిపేటలోని ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ (ఐఎంఎల్‌) డిపో నుంచి మద్యం సరఫరా అవుతోంది. జిల్లాలో గత ఏడాది రూ.606 కోట్ల అమ్మకాలు జరుగగా.. ఈ ఏడాది సెప్టెంబరు వరకు రూ. 481 కోట్లు విక్రయాలు జరిగాయి. ఈనెల 1,2,3 తేదీల్లోనే రూ. 8.8 కోట్ల  విలువైన మద్యం దుకాణాలకు చేరుకుంది. ఈ నెల 4,5 తేదీల్లో ఆ మొత్తం రూ.10 కోట్లు దాటుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
మేకలకు డిమాండ్‌...
దసరా రోజు తెల్లవారే సరికే పల్లెంలో మటన్‌ బొక్క కొట్టాలని పెద్దలు అంటుంటారు. అందుకే కాబోలు పండగ రోజున మాంసం వంటలు ప్రత్యేకం. జిల్లాలోని కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లో మేకలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. మామూలు రోజుల్లో మేక రూ. 5 నుంచి రూ. 6వేలు ఉండగా దసరా సందర్భంగా ఒక్కో మేక రూ. 8వేల నుంచి రూ. 10వేలు పలికింది. జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 15కోట్ల మాంసం విక్రయాలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని