logo

రావణ దహనానికి ఏర్పాట్లు

విజయ దశమి సందర్భంగా రావణ దహనం ఏర్పాట్లు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం వరకు రావణాసూరుడి బొమ్మ ఏర్పాట్లు పూర్తి కానున్నాయి.

Published : 05 Oct 2022 04:36 IST


తిలక్‌ మైదానంలో ఏర్పాటు చేస్తున్న రావణాసురిడి బొమ్మ

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: విజయ దశమి సందర్భంగా రావణ దహనం ఏర్పాట్లు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం వరకు రావణాసూరుడి బొమ్మ ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. దహన సమయంలో లోపలికి ప్రజలంతా దూసుకెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆదేశాలతో పకడ్బందీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రజలంతా సులభంగా రావణ దహనాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రధాన ద్వారం వద్ద ఇప్పటికే ఆయా పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. మరోవైపు పట్టణంలో ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొనకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సింగరేణి సంస్థ కనీసం మైదానం చుట్టు పక్కల పిచ్చిమొక్కలను తొలగించలేదు. సింగరేణి అధికారులు మైదానంలో విజయదశమి సందర్భంగా పిచ్చిమొక్కలు తొలగించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మున్సిపాల్టీ అధికారులు మైదానాన్ని శుభ్రం చేయించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని