logo

అధిష్ఠానం దృష్టికి సమస్యను తీసుకెళ్తాం

రెండు పడకల గది ఇంటి నిర్మాణంలో సంబంధిత గుత్తేదారు డబ్బులు అడగటాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీపీ తుల శ్రీనివాస్‌ అన్నారు.

Published : 27 Nov 2022 03:43 IST

బాధితుడు సాయన్నకు నగదు అందజేస్తున్న ఎంపీపీ తుల శ్రీనివాస్‌, నాయకులు

బోథ్‌, న్యూస్‌టుడే: రెండు పడకల గది ఇంటి నిర్మాణంలో సంబంధిత గుత్తేదారు డబ్బులు అడగటాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీపీ తుల శ్రీనివాస్‌ అన్నారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సాయన్నను ఎంపీపీ పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. బాధితుడి ఇంటి స్థలాన్ని పరిశీలించారు. తెరాస ప్రభుత్వం పేదల అభివృద్ధికి పలు పథకాలను ప్రవేశపెడుతుందని, కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.

బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్‌

బోథ్‌: రెండు పడక గదుల ఇంటి నిర్మాణం చేపట్టక మనస్తాపంతో బోథ్‌ సాయినగర్‌లోని బుడగజంగం కాలనీకి చెందిన మిర్యాల సాయన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని.. ఈ ఘటనపై కలెక్టర్‌ విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ నాయకుడు ఆడె గజేందర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బోథ్‌ సీహెచ్‌సీలో బాధితుడిని, సాయినగర్‌లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.2,500 ఆర్థికసాయం, సరకులు అందజేశారు. మండల అధ్యక్షుడు మహేందర్‌, నియోజకవర్గ మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌, జిల్లా నాయకులు శేఖర్‌, అబ్రర్‌, రమేష్‌, నాజర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని