logo

అనారోగ్యంతో మాజీ మావోయిస్టు మృతి

మావోయిస్టు కార్యకలాపాల్లో అశోక్‌ అలియాస్‌ నరేష్‌గా చురుకుగా పాల్గొని అనంతరం లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన ఉట్ల నర్సింలు(62) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు.

Published : 27 Nov 2022 03:43 IST

ఉట్ల నర్సింలు

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : మావోయిస్టు కార్యకలాపాల్లో అశోక్‌ అలియాస్‌ నరేష్‌గా చురుకుగా పాల్గొని అనంతరం లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన ఉట్ల నర్సింలు(62) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. 1990 జులై 31న లొంగిపోవటంతో ప్రభుత్వం ఇంటి స్థలం అందించి, వడ్రంగి దుకాణం ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడిగా పని చేస్తున్నారు. కలపతో కళాఖండాలు తయారు చేయటంలో ప్రవీణుడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ సైతం చేశాడు.


లారీని ఢీకొన్న టిప్పర్‌: తప్పిన పెను ప్రమాదం

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే: మావల పోలీసు స్టేషన్‌ పరిధిలోని బట్టిసావర్‌గాం సమీపంలో జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి కంటైనర్‌ ఢీకొన్న ప్రమాదం చోటు చేసుకుంది. బట్టిసావర్‌గాం సర్వీస్‌ రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వెళుతున్న లారీని నాగపూర్‌ వైపు వెళ్తున్న కంటైనర్‌ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ వాహనాలు రెండు కూడా వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కంటైనర్‌ ముందు భాగం కొంత ధ్వంసం అయింది. ఎవరికి గాయాలు కాలేదు.


అడవి పందుల దాడిలో పంట నేలమట్టం

నేరడిగొండ: కొర్టికల్‌ శివారులో శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన పులి సురేశ్‌కు చెందిన రెండెకరాలతో పాటు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న 5 ఎకరాల్లోని పత్తి పంటను అడవి పందులు ధ్వంసం చేశాయి.  


ఎస్‌ఈని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి

బేల, న్యూస్‌టుడే: విద్యుత్తుశాఖ ఎస్‌ఈ ఉత్తం జాడే బదిలీ కావడంపై ఆ శాఖ కింది స్థాయి ఉద్యోగులు కార్యాలయం ఎదుట సంబరాలు జరుపుకోవడాన్ని ఖండిస్తున్నామని అంబేడ్కర్‌ మెమోరియల్‌ అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు రాహుల్‌ కాంబ్లే పేర్కొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. తహసీల్దార్‌ బి.రాంరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులు గవండే దుర్వాస్‌, మిలింద్‌ కాంబ్లే, మస్కే భీంరావు, గజానన్‌ ఖోబ్రగడే, అజయ్‌, అమూల్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని