logo

సమస్యలు పరిష్కరించాలని మంత్రులకు వినతి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డిలను బుధవారం ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు హైదరాబాద్‌లోని వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 01 Dec 2022 05:42 IST

హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీలకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు

బోథ్‌, న్యూస్‌టుడే : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డిలను బుధవారం ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు హైదరాబాద్‌లోని వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి కేటీఆర్‌కు బోథ్‌లో డిగ్రీ కళాశాల, అగ్నిమాపక కేంద్రం, నూతన రెవెన్యూ డివిజన్‌, నూతన మండలాన్ని ఏర్పాటు, కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలవాలని, కొన్ని గిరిజన గ్రామాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, నియోజకవర్గానికి నూతన డీఎస్పీ పోస్టును మంజూరు చేయాలని విన్నవించానన్నారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి కుంటాల జలపాతానికి వెళ్లే రహదారిలో వంతెన నిర్మాణానికి, రాంపూర్‌ - భీంపూర్‌ రహదారికి, ఇచ్చోడ మండల కేంద్రంలోని రహదారికి నిధులు మంజూరు చేయాలని విన్నవించానన్నారు. అనంతరం బజార్‌హత్నూర్‌ మండలంలోని కొల్హారి, మోర్కండి వంతెనలకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని