logo

కష్టపడ్డారు.. అనుకున్నది సాధించారు

రోజు రోజూకు పెరిగిపోతున్న ఉద్యోగాల పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగమే సాధించడం కష్టంగా మారింది. అలాంటిది తాము ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిరంతరం కష్టపడి రెండేసీ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated : 01 Dec 2022 07:28 IST

 రెండేసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులు..
దిలావర్‌పూర్‌, న్యూస్‌టుడే

     

యాటకారి ముత్యం  , జాదవ్‌ సుదీప్‌కుమార్‌

రోజు రోజూకు పెరిగిపోతున్న ఉద్యోగాల పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగమే సాధించడం కష్టంగా మారింది. అలాంటిది తాము ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిరంతరం కష్టపడి రెండేసీ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సాపూర్‌(జి) మండలంలోని టెంబుర్ని గ్రామానికి చెందిన యాటకారి సురేందర్‌, పోసాని దంపతుల కుమారుడు ముత్యం ఎంకామ్‌తో పాటు ఐటీఐ పూర్తిచేశారు. 2021లో వెలువడిన కానిస్టేబుల్‌, లైన్‌మెన్‌ ఉద్యోగాలకు ప్రభుత్వ కొలువులకు ఎలాంటి శిక్షణ లేకుండానే సన్నద్ధమయ్యారు. నిరంతర సాధనతో మొదట లైన్‌మెన్‌ ఉద్యోగం సాధించి, మరో మూడు నెలలకు కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించి నిర్మల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సై ఉద్యోగానికి కసరత్తు చేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే సన్నద్ధం..

లోకేశ్వరం మండల పొట్టపల్లి గ్రామానికి చెందిన జాదవ్‌ సుమన్‌బాయి, కిషన్‌రావు దంపతుల సుదీప్‌కుమార్‌ ఎంఎస్సీ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తునే 2022లో వెలువడిన  ప్రభుత్వ పోటీ పరీక్షలకు నిరంతర సాధనతో దక్షిణ మధ్య రైల్వేలో గ్రూప్‌.డి ఉద్యోగం, సర్వశిక్షఅభియాన్‌లో ఏపీవోగా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉన్న యువకులు నిరంతర సాధనతో అనుకున్నది సాధించవచ్చని విజేతలుగా నిలిచిన ఈ యువకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు