logo

టూరిస్టు బస్సుకు విద్యుదాఘాతం

నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం కల్లూరులో బస్సుకు విద్యుత్తు తీగ తగిలిన ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.

Published : 02 Dec 2022 03:05 IST

ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

కల్లూరులో ఆగిన బస్సుపైన దగ్గరలో విద్యుత్తులైన్‌ తీగ

భైంసా పట్టణం, న్యూస్‌టుడే : నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం కల్లూరులో బస్సుకు విద్యుత్తు తీగ తగిలిన ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. ఆదిలాబాద్‌కు చెందిన శిశుమందిర్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు గురువారం కల్లూరులోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రైవేటు బస్సులో వచ్చారు. ఆలయ సమీపంలో చోదకుడు బస్సును నిలిపే క్రమంలో పైనున్న విద్యుత్తు తీగ బస్సుకు కొంత తగిలింది. బస్సు ఆగిందని భావించిన  అయిదో తగరతి విద్యార్థులు హరిచరణ్‌, రణధీర్‌ చెప్పులు లేకుండా దిగుతుండగా కాలు నేలకు తగలగానే ఎర్తింగ్‌ వచ్చి విద్యుదాఘాతనికి గురై తీవ్రంగా గాయపడ్డారు. అంతలోనే బస్సు కొంత ముందుకు కదలడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది బాధిత బాలురను భైంసా ప్రాంతీయాసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. కుంటాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని