logo

తాడోబా అభయారణ్యంలో రెండు పెద్దపులుల కళేబరాలు లభ్యం

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన తాడోబా అభయారణ్యంలో గురువారం వేర్వేరు చోట్ల రెండు పెద్దపులుల కళేబరాలు కనిపించడం అధికారుల్లో ఆందోళనకు కారణమైంది.

Published : 02 Dec 2022 03:05 IST

టి-60 ఆడపులి కళేబరం

బల్లార్ష, న్యూస్‌టుడే : మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన తాడోబా అభయారణ్యంలో గురువారం వేర్వేరు చోట్ల రెండు పెద్దపులుల కళేబరాలు కనిపించడం అధికారుల్లో ఆందోళనకు కారణమైంది. అభయారణ్యాల బఫర్‌ జోన్‌లోని శివనీ, మోహర్లీ అటవీక్షేత్రాల్లో గస్తీ తిరుగుతున్న గార్డులకు టి-75గా పిలిచే పెద్దపులి, టి-60గా పిలిచే ఆడపులి కళేబరాలు కనిపించాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. అభయారణ్యాల ఉప సంచాలకులు కుశాగ్ర పాటక్‌, వన్యప్రాణుల సంరక్షణ సమితి అధ్యక్షులు బండూదోత్రే, సీఎఫ్‌ఓ బాందూర్‌కర్‌, వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని శవపరీక్షల అనంతరం ఘటనా స్థలంలోనే ఖననం చేశారు. టి-75 పులి 20-25 రోజుల కిందట, టి-60 పులి నాలుగైదు నెలల కిందట మృతిచెంది ఉంటాయని అంచనా వేశారు. రెండు పులులకు మధ్య జరిగిన ఘర్షణలో చనిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

టి-75 పులి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని