logo

ప్రజా చైతన్యంలో కళాకారులది కీలక పాత్ర

ప్రజలను చైతన్యపర్చడంలో కళాకారుల పాత్ర కీలకమని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ అన్నారు. జైనూర్‌ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కళాకారుడు పద్మశ్రీ కనకరాజుకు ప్రభుత్వం రూ.కోటి ప్రకటించిన నేపథ్యంలో..

Published : 04 Dec 2022 05:30 IST

పద్మశ్రీ కనకరాజుకు ఇంటి స్థల ధ్రువపత్రం, వాహనం అందజేత

పద్మశ్రీ కనకరాజుకు వాహన తాళం, స్థల పత్రం అందజేస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, పాలనాధికారి రాహుల్‌రాజ్‌, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సక్కు, కోనప్ప

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే : ప్రజలను చైతన్యపర్చడంలో కళాకారుల పాత్ర కీలకమని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ అన్నారు. జైనూర్‌ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కళాకారుడు పద్మశ్రీ కనకరాజుకు ప్రభుత్వం రూ.కోటి ప్రకటించిన నేపథ్యంలో.. శనివారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతువేదికలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, అదనపు పాలనాధికారి చాహత్‌ బాజ్‌పాయిలతో కలసి పాల్గొని మాట్లాడారు. మొదట బోలెరో వాహనాన్ని, ఇంటి స్థల పత్రాలను కనకరాజుకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. శాస్త్రీయ కళలను కాపాడటంలో, ప్రజలను చైతన్య పరచడంలో కళాకారుల పాత్ర ముఖ్యమన్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన గుస్సాడీ కనకరాజు మన జిల్లాకు చెందినవారు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు మణెమ్మ, తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, జీసీడీవో శకుంతల, గిరిజన సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు