logo

ప్రదర్శనలతో మెప్పించి.. ప్రశంసలు పొంది

సమాజానికి ఉపయోగపడేలా ప్రయోగాలు చేసేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడం సంతోషంగా ఉందని డీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు.

Updated : 04 Dec 2022 06:29 IST

నస్పూర్‌లో బహుమతులు, ప్రశంసా పత్రాలు పొందిన విద్యార్థులతో డీఈఓ వెంకటేశ్వర్లు

నస్పూర్‌, న్యూస్‌టుడే: సమాజానికి ఉపయోగపడేలా ప్రయోగాలు చేసేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడం సంతోషంగా ఉందని డీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు. నస్పూర్‌లో ఆక్స్‌పర్డ్‌ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్‌ మనక్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాలానికి అనుగుణంగా విద్యార్థులు సృజనకు పదును పెట్టి సమాజానికి ఉపయోగపడేలా వివిధ రంగాల అభివృద్ధికి దోహదపడే ప్రయోగాలు, పరిశోధనలు చేయాలని పేర్కొన్నారు. ఇన్‌స్పైర్‌కు 10 మంది, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన జూనియర్‌ విభాగంలో 7, సీనియర్‌ విభాగంలో 7, టీఎల్‌ఎం 1, సెమినార్‌ విభాగంలో ఒక్కరు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎంఈవో పోచయ్య, జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, ట్రస్మా నాయకులు ఉపేందర్‌, దేవన్న, విష్ణువర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే

- ఇన్‌స్పైర్‌లో విజేతలు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు పావని(భీమారం), రాకేష్‌(వీగాన్‌), సాయి కుమార్‌(దొనబండ), విష్ణువర్ధన్‌(కిష్టాపూర్‌), బిందుప్రియ( ముత్యంపల్లి), సంజయ్‌ (నెన్నల) మణిప్రసాద్‌( అన్నారం) జశ్వంత్‌(చంద్రవల్లి) విజేతలుగా నిలిచారు. కుశీంద్రవర్శ(గుడ్‌ షేపర్డ్‌ హైస్కూల్‌, లక్షెట్టిపేట) సాయిలాస్విక్‌(తవక్కల్‌ హైస్కూల్‌, రామకృష్ణాపూర్‌) గెలుపొందారు.

రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో..

- జూనియర్‌ విభాగంలో..
సాత్విక్‌(జడ్పీఎస్‌ఎస్‌, వెల్గనూర్‌), శివనందిని (ట్రినిటీ హైస్కూల్‌, మంచిర్యాల), ఆదిత్య, మాణుచరణ్‌ (ఆక్స్‌పర్డ్‌ హైస్కూల్‌, నస్పూర్‌), అక్షయ(జడ్పీఎస్‌ఎస్‌, అకెనపల్లి), ప్రణయ్‌(టీఎస్‌ఆర్‌ఎస్‌, బెల్లంపల్లి) లక్ష్య(కేజీబీవీ, లక్షెట్టిపేట)

- సీనియర్‌ విభాగంలో..

సాయివిజ్ఞేష్‌ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ బెల్లంపల్లి),  దేవిశ్రీ(కార్మెల్‌ హైస్కూల్‌, మంచిర్యాల), చిద్విలాస(ఆర్‌బిహెచ్‌వి, మంచిర్యాల), రసజ్ఞ((ఎంజేపీటీబీసీడబ్యూఆర్‌ఎస్‌(బాలికల) బెల్లంపల్లి) విజేతలుగా నిలిచారు. జిల్లా పరిషత్తు పాఠశాలకు చెందిన ఆదర్శ (అచలాపూర్‌), జగదీశ్వర్‌ (బాదంపల్లి), స్థితప్రజ్ఞ(ఆవడం)లు గెలుపొందారు.

టీచర్‌ విభాగం: (టీఎల్‌ఎం) (జి.శ్రీనివాస్‌, కాసిపేట)

సెమినార్‌ విభాగం: (సైంటిఫిక్‌ ఇన్నోవేషన్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ప్యూచర్‌ (జిసిరి, శ్రీ ఛైతన్య హైస్కూల్‌, మందమర్రి)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని