logo

దళితబంధుకు వసూళ్ల జాడ్యం..

దళితులకు ఆర్థిక భరోసా అందించి ఉపాధి కల్పించేలా రూపొందించిన దళితబంధు పథకంలో అక్రమాల పర్వం కొనసాగుతోంది.

Published : 04 Dec 2022 05:30 IST

ఎమ్మెల్యేకు తెలియడంతో జాబితా తిరస్కరణ

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: దళితులకు ఆర్థిక భరోసా అందించి ఉపాధి కల్పించేలా రూపొందించిన దళితబంధు పథకంలో అక్రమాల పర్వం కొనసాగుతోంది. అర్హుల జాబితాను రూపొందించేలా తోడ్పాటు అందించాలంటూ ఎమ్మెల్యే తమ నేతలకు చెప్పడంతో.. ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసి జాబితాలో చోటుకల్పించారు. ఈ విషయం  చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలియడంతో.. కౌన్సిలర్లు, వార్డు సభ్యులను పిలిచి మందలించినట్లుగా విశ్వసనీయ సమాచారం.

ప్రతి నియోజకవర్గంలో వంద మంది అర్హులను గుర్తించి, వారికి దళితబంధు పథకంలో భాగంగా.. రూ.10 లక్షల విలువైన యూనిట్లు అందించారు. రెండో విడతలో ఒక్కో నియోజకవర్గంలో 500 మందికి ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. లబ్ధిదారుల ఎంపిక ప్రకియలో అక్రమాలు భారీ స్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఉద్యోగులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు తమ పేర్లు లబ్ధిదారుల జాబితాలో చేరేలా జాగ్రత్త పడ్డారు. వీరు ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ద్వితీయ స్థాయి నేతలకు కట్టబెట్టారు. డబ్బుల వసూళ్ల పర్వం గురించి ఎమ్మెల్యేకు తెలియడంతో.. చెన్నూరు నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారులను మళ్లీ కొత్తగా ఎంపిక చేసే యోచనలో ఉన్నారు.  ఈసారైనా పారదర్శకంగా పేదలనుఎంపిక చేయాలని దళితులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని