logo

సామాజిక సేవలో ముందుండాలి

సామాజిక సేవలో ముందుండాలని, విద్యార్థులకు చేయూతను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.

Published : 04 Dec 2022 05:30 IST

విద్యార్థులకు ఉచిత బ్యాగులు, స్వెటర్లు, ఇతర సామగ్రి అందజేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: సామాజిక సేవలో ముందుండాలని, విద్యార్థులకు చేయూతను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం లోహర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తలమడుగు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అధికారి కాడే స్వామి రూ.50 వేల విలువైన స్వెటర్లు, బ్యాగులు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. వీటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఎంపీపీ రమేష్‌, వైస్‌ ఎంపీపీ జంగు, నాయకులు ప్రహ్లాద్‌, జగదీశ్‌, మాల సంక్షేమ సంఘం నాయకులు సూరం భగువాండ్లు, నల్ల రాజేశ్వర్‌, రాఘవేంద్ర, గంగన్న, రామన్న, తదితరులు పాల్గొన్నారు.

అన్ని రకాల మార్కెట్ల అభివృద్ధి

ఆదిలాబాద్‌ పట్టణం: పట్టణంలో అన్ని రకాల మార్కెట్‌లను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. స్థానిక బొక్కల్‌గూడలో రూ.50 లక్షలతో నిర్మించే నాన్‌వెజ్‌ మార్కెట్‌ భవన ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని శనివారం ఆవిష్కరించారు. మరో రూ.50 లక్షల వరకు వెచ్చించి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. పుర కమిషనర్‌ శైలజ, పురపాలక వైస్‌ ఛైర్మన్‌ జహీర్‌రంజాని, తెరాస పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అజయ్‌, అశ్రాఫ్‌, తెరాస మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు స్వరూప, బొడగం మమత, నాయకులు పండ్ల శ్రీనివాస్‌, అత్తర్‌ఉల్లా, సాజిదొద్దీన్‌, సలీంపాషా, కోఆప్షన్‌ సభ్యుడు ఎజాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

నాగోబా ఆలయ వేడుకలు జయప్రదం చేయాలి

ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఇంద్రవెల్లి నాగోబా ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన కరపత్రాలు, గోడ ప్రతులను శనివారం ఆయన మెస్రం వంశస్థులు, ఆలయ నిర్వాహకులతో కలిసి ఆదిలాబాద్‌లో ఆవిష్కరించారు. ఆలయ పీఠాధిపతి వెంకట్రావ్‌, చిన్ను, శేఖర్‌, తుకారాం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని