పాత వాహనాలు పనికిరావు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నడిచే వాహనాలకు నిర్ణయించిన కాలపరిమితిని ఇక నుంచి పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ పట్టుదలతో ఉంది. దీంతో జిల్లాలో పాత వాహనాలు తక్కులోకి చేరే అవకాశముంది.
ఏప్రిల్ 1 నుంచి అమలుచేసేలా చర్యలు
విక్రయానికి సిద్ధంగా పాత ద్విచక్రవాహనాలు
మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నడిచే వాహనాలకు నిర్ణయించిన కాలపరిమితిని ఇక నుంచి పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ పట్టుదలతో ఉంది. దీంతో జిల్లాలో పాత వాహనాలు తక్కులోకి చేరే అవకాశముంది. పాత వాహనాలు కొనుగోలు చేసేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో ఈ నిబంధనలు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంతో నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా నిర్ధేశిత కాలపరిమితి ముగిసిన వాహనాలు రోడ్డుపై నడవకుండా చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేస్తోంది.
తుక్కు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు...
ప్రభుత్వం నిర్దేశిత గడువు నిండిన వాహనాలు రోడ్డుపై నడపకుండా ఉండేందుకు రవాణా శాఖ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. తొలుత ప్రభుత్వ వాహనాలు గుర్తించేందుకు ఇప్పటికే జిల్లా రవాణాశాఖ అధికారులు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు వాహనాల వివరాలు అందించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ వాహనాలకు 15 ఏళ్లు, వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల పాటు నిర్ధేశిత కాలపరిమితి ఉంది. ఇది ముగిసిన వెంటనే ఆయా వాహనాల సామర్థ్య పరీక్షలు విధిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక వాహనాలు సామర్థ్య పరీక్షలు చేయకుండా రహదారులపై తిరుగుతుండడంతో వాహన కాలుష్యం భారీగా పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు పాతవాహనాలను గుర్తించి తుక్కుకేంద్రాలకు తరలించనున్నారు. దీనికోసం ప్రభుత్వం తుక్కు కేంద్రాలను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గడువు మీరిన పాత వాహనాలను తుక్కుగా మార్చి కొత్త వాహనాలను కొనుగోలు చేసే వాహనదారులకు రాయితీలు అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాయితీలు ఇచ్చినట్లయితే వాహనదారులు పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ చర్యల ద్వారా కాలుష్యం తగ్గించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది.
ప్రభుత్వ శాఖల వివరాలు సేకరిస్తున్నాం..
- కిష్టయ్య, జిల్లా రవాణాశాఖ అధికారి, మంచిర్యాల
జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్నటువంటి వాహనాల వివరాలను సేకరించే ప్రక్రియ చేపట్టాం. ఏప్రిల్ 1 నుంచి పాతవాహనాలను తుక్కుగా మార్చాలనే ఆదేశాలు ఇంతవరకు అధికారికంగా అందలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఆ రకమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండేలా పాతవాహనాల వివరాలు సేకరించే పనులు చేస్తున్నాం. ఇప్పటికే హరితపన్ను వసూలు చేస్తున్నప్పటికీ గడువుమీరిన వాహనాలపై చర్యలు తీసుకుంటేనే సమాజానికి మేలు కలుగుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: ఆటోను ఢీకొన్న ట్రాక్టర్.. ముగ్గురు మృతి
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Politics News
Revanth Reddy: మార్పు కోసమే యాత్ర: రేవంత్రెడ్డి
-
India News
PM Modi: హెచ్ఏఎల్పై దుష్ప్రచారం చేసిన వారికి ఇదే సమాధానం: ప్రధాని మోదీ
-
General News
Andhra news: తమ్ముడూ నేనూ వస్తున్నా.. గంటల వ్యవధిలో ఆగిన గుండెలు
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా