logo

అన్నదాతల ఆందోళన

మండలంలోని పంట పొలాలకు 24 గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని రైతులు, అఖిలపక్ష నాయకులతో కలిసి గురువారం బోథ్‌ ప్రధాన రహదారిపై బైఠాయించారు.

Updated : 27 Jan 2023 05:57 IST

బోథ్‌ ప్రధాన రహదారిపై బైఠాయించిన రైతులు

బోథ్‌, న్యూస్‌టుడే : మండలంలోని పంట పొలాలకు 24 గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని రైతులు, అఖిలపక్ష నాయకులతో కలిసి గురువారం బోథ్‌ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజుకు కేవలం 5 నుంచి 6 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంటలు పూత, విత్తు దశలో ఉన్నాయని, సరైన మోతాదులో నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. అనంతరం ఇంచార్జి ఏఈ వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. భాజపా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజుయాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.


సారూ.. విద్యుత్తు సరఫరా చేయండి

నేరడిగొండలో విద్యుత్తు ఏఏఈ నాగేంద్రప్రసాద్‌తోవాగ్వాదానికి దిగిన రైతులు

నేరడిగొండ: మండలంలో విద్యుత్తు సరఫరా చేసి పంటలు కాపాడాలని రైతులు విద్యుత్తు ఏఏఈ నాగేంద్రప్రసాద్‌రావును కోరారు. మూడు రోజులుగా త్రిఫేజ్‌ కరెంట్‌ సరఫరా లేక పంటలు దెబ్బతింటున్నాయని శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలోని విద్యుత్తు కార్యాలయానికి పలు గ్రామాల రైతులు చేరుకొన్నారు. అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు వసంత్‌ అక్కడికి చేరుకొని ఉన్నతాధికారులతో చరవాణిలో మాట్లాడగా, రెండు రోజుల పాటు నిత్యం అయిదు గంటలు సరఫరా చేస్తామని తరువాత యథావిధిగా 24 గంటల పాటు వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్తు సరఫరా చేస్తామని తెలపడంతో రైతులు శాంతించారు. కాంగ్రెస్‌ మండల కన్వీనర్‌ వసంత్‌, సద్దాం, కుంటాల సర్పంచి అశోక్‌, కుంటాల, వాగ్ధారి, కుమారి, సావర్‌గాం గ్రామాల రైతులు ఉన్నారు.

నీటి కోసం తిప్పలు

జైనథ్‌: జైనథ్‌ మండలం లక్ష్మీపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఆయకట్టు రైతులకు నీటి పారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో తిప్పలు పడుతున్నారు. ఈ రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాలువల ద్వారా 7,600 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. శనగ, జొన్న, మక్క, నువ్వులు తదితర పంటలు రైతులు సాగు చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఆయా గ్రామాల రైతుల సంబంధిత అధికారులు చేలకు నీటిని ఆపేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని